Janasena Party: జనసేన పార్టీకి గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్ర ఎన్నికల సంఘం.. మరోసారి అదే గుర్తు

జనసేన గాజు‌ గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కొంతకాలం కింద రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇక పార్టీకి గాజు గ్లాసు గుర్తు ఉండబోదంటూ పెద్ద‌ఎత్తున ప్రచారం జరిగింది.

JanaSena Party symbol glass

JanaSena Chief Pawan Kalyan: జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆ పార్టీకి మరోసారి గ్లాస్ గుర్తునే కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా ఆ పార్టీ నేతలు వెల్లడించారు. దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు ఎన్నికల గుర్తు ‘గాజు గ్లాసు’పైనే పోటీ చేయబోతున్నారు. జనసేనకు మరోసారి గ్లాస్ గుర్తును కేటాయించడం పట్ల కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.

Read Also: JanaSena: టీడీపీతో పొత్తు.. జనసేన ఎన్ని సీట్లు అడుగుతుంది.. ఎవరు ఎక్కడ నుంచి పోటీ?

గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో జనసేన అభ్యర్థులు గాజు గ్లాస్ గుర్తుపైనే పోటీ చేసిన విషయం తెలిసిందే. ఏపీలో 137 స్థానాల్లో, తెలంగాణలో ఏడు లోక్‌సభ స్థానాల్లో జనసేన అభ్యర్థులు గత సార్వత్రిక ఎన్నికల సమయంలో బరిలో నిలిచారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ, ఏపీలలో బరిలో నిలిచేందుకు జనసేన అభ్యర్థులు సన్నద్ధమవుతున్న తరుణంలో జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తు కేటాయించింది. దీంతో ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Pawan Kalyan : మహిళా రిజర్వేషన్ బిల్లుపై పవన్ కల్యాణ్ రియాక్షన్

జనసేన గాజు‌ గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కొంతకాలం కింద రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇక పార్టీకి గాజు గ్లాసు గుర్తు ఉండబోదంటూ పెద్ద‌ఎత్తున ప్రచారం జరిగింది. ఈ తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం పార్టీకి రిజిస్టర్డ్ గుర్తు అయిన గాజు గ్లాస్ గుర్తును కేటాయించడం పట్ల పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తో పాటు, జనసేన పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాలు, కేంద్ర ఎన్నికల సంఘంలోని అధికారులు, యావన్మంది సిబ్బందికి పేరుపేరున జనసేన పార్టీ తరపున కృతజ్ఞతలు తెలిపారు.

 

ట్రెండింగ్ వార్తలు