Andhra Pradesh : ఏపీలో వరదలు..కేంద్ర బృందం వచ్చేస్తోంది

సీఎం జగన్ రాసిన లేఖకు స్పందించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపుతోంది.

Andhra Pradesh Floods : ఏపీని వరదలు బీభత్సం సృష్టించాయి. కనీవినీ ఎరుగని వర్షాలతో కొన్ని జిల్లాలు వణికిపోయాయి. ప్రాణ, ఆస్తినష్టం భారీగానే సంభవించింది. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు అపారనష్టాన్ని కలిగించాయి. చేతికొచ్చిన వేలాది ఎకరాల పంటలు నీట మునిగిపోయాయి. దీంతో రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. చాలా మంది వరద ఉధృతికి ఎంతోమంది కొట్టుకపోయారు.

Read More : Floating City : ప్రపంచంలో తొలిసారిగా..నీటిపై తేలియాడే నగరం ఏర్పాటుకి ఒప్పందం

పలువురి మృతదేహాలను ఇప్పటి వరకు వెలికితీయగా..మరికొంతమంది ఆచూకీ ఇప్పటికీ తెలియడం లేదు. ఈ క్రమంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఏపీని ఆదుకోవాలని సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసేందే. తక్షణమే రూ. 1000 కోట్లు కేటాయించాలని కోరారు. ఈ క్రమంలో…వరద నష్టం కోసం అంచనా కోసం 2021, నవంబర్ 26వ తేదీ శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటించనుంది. సీఎం జగన్ రాసిన లేఖకు స్పందించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపుతోంది.

Read More : Rakesh Tikait : రైతుల ఉద్యమానికి ఏడాది…డిమాండ్లు అంగీకరిస్తేనే ఇళ్లకు వెళుతాం

కేంద్రం నుంచి వచ్చే ఏడుగురు సభ్యులు..రెండు బృందాలుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. కేంద్ర హోం శాఖ సలహాదారు కునాల్ సత్యార్థి నేతృత్వంలో మూడు రోజుల పాటు ఏపీలో బృందం పర్యటించనుంది. 26వ తేదీన చిత్తూరు, 27న చిత్తూరు, కడప, 28వ తేదీన నెల్లూరు జిల్లాల్లో కేంద్రం బృందం పర్యటించనుంది. అనంతరం చివరి రోజున సీఎం జగన్ తో భేటీ కానుంది. మరి కేంద్ర బృందం ఎలాంటి నివేదిక అందిస్తుందో..ఎంత అంచనా వేస్తుందో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు