10TV Conclave: నేను ప్రభుత్వంలో నం.2 అనేది అబద్ధం: సజ్జల

సంక్షేమ పాలనలో బాగా సంతృప్తి ఇచ్చిన పథకాలు ఏవో తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని లేకుండా చేసిన పాపం చంద్రబాబుదేనని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. విజయవాడ హోటల్‌ ఐలాపురంలో నిర్వహించిన ‘10టీవీ కాన్‌క్లేవ్ ఏపీ రోడ్‌మ్యాప్’లో సజ్జల మాట్లాడారు. రాజధాని పేరుతో టీడీపీ అధినేత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని తెలిపారు. తాను ఏపీ ప్రభుత్వంలో నం.2 అనేది అబద్ధమని సజ్జల చెప్పారు.

జగన్‌ పెట్టిన పార్టీ.. ఆయన కష్టమ్మీద వచ్చిన పార్టీ అని తెలిపారు. జగన్‌ చేయగలిగినవన్నీచెప్పారని, చెప్పినవే గాకుండా దానికి మించి చేశారని అన్నారు. అవినీతిరహితంగా, పూర్తి పారదర్శకంగా, నాయకుల ప్రమేయం లేకుండా సంక్షేమ కార్యక్రమాలను జగన్‌ పూర్తిగా అమలు చేశారని చెప్పారు.

అధిక శాతం ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. చంద్రబాబు చేసిన హామీలను అమలు చేయడానికి లక్షల కోట్ల రూపాయల నిధులు కావాలని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమమే వైసీపీ సక్సెస్‌ను నిర్ణయిస్తుందని తెలిపారు.

ఇలాంటి లీడరైతే బాగుంటుందనే విధంగా జగన్‌ స్పష్టతనిచ్చారని సజ్జల తెలిపారు. కానీ మోసానికి, ఇచ్చిన మాటలు తప్పడమో, అధికారమే పరమావధిగా చేసుకున్నట్లు అటువైపు టీమ్‌లో స్పష్టంగా కన్పిస్తోందని అన్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన వన్నీ జగన్‌ అమలు చేశారని, కరోనా రాకపోతే ఇంత కష్టం ఉండేది కాదని చెప్పారు. అది వచ్చినా మాట తప్పకుండా హామీలు అమలు చేశారని అన్నారు.

ఐదేళ్ల వైసీపీ పాలనలో సాధించిన విజయాలు ఏంటో సజ్జల వివరించారు. సంక్షేమ పాలనలో బాగా సంతృప్తి ఇచ్చిన పథకాలు ఏవో తెలిపారు. ఐదేళ్లలో ఇంకా చేయలేకపోయినవి ఏవైనా ఉన్నాయా? అన్న ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు. సంపద సృష్టించలేదని, అప్పులే చేస్తున్నారని విపక్షాలు చేస్తున్న విమర్శలపై తన స్పందనను తెలిపారు. ఈ ఐదేళ్లలో రాష్ట్ర అదాయం ఎంత పెరిగిందో, ఎందుకని ప్రచారం చేసుకోలేపోయారో చెప్పారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక ఈ స్థాయిలో సంక్షేమాన్ని ఊహించవచ్చా? ఇంకేమైనా కొత్త పథకాలు ఉంటాయా? అన్న విషయాలను వివరించి చెప్పారు.

పూర్తి వివరాలు..

Also Read: ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

ట్రెండింగ్ వార్తలు