ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
కేరళలోని కన్నూర్‌లో ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Lok Sabha elections 2024
లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 88 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 9 గంటల వరకు త్రిపురలో అత్యధికంగా 16.65 శాతం, మహారాష్ట్రలో అత్యల్పంగా 7.45 శాతం ఓటింగ్ నమోదైంది.
దేశంలోని 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో పోటింగ్ కొనసాగుతోంది. కేరళలోని కన్నూర్‌లో ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బెంగళూరులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఓటు వేశారు.
బెంళూరులో ఓటు వేశాక కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. భారీ సంఖ్యలో ప్రజలు బయటకు వచ్చి ఓటు వేయాలని కోరుకుంటున్నానని చెప్పారు. దేశ ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజలకు మంచి విధానాలు, అభివృద్ధి కావాలని అన్నారు.
జోధ్‌పూర్‌లోని పోలింగ్ బూత్‌లో మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ ఓటు వేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు సౌత్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి తేజస్వి సూర్య ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఇవాళ మొత్తం 15.88 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. 1.67 లక్షల పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది. 16 లక్షలకు పైగా పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పోటీచేసే వయనాడ్ లోనూ పోలింగ్ జరుగుతోంది.
ఇవాళ పోలింగ్ జరుగుతుున్న 88 నియోజకవర్గాల్లో 2019లో 52 స్థానాల్లో బీజేపీ గెలిచింది. అలాగే,12 సీట్లు బీజేపీ మిత్రపక్షాలు గెలుచుకున్నాయి. ప్రస్తుతం ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు అప్పట్లో 23 స్థానాల్లో గెలిచాయి.
#LokSabhaElections2024 | Kerala CM Pinarayi Vijayan casts his vote at polling station number 161 in Kannur pic.twitter.com/XdQLAdzLCt
— ANI (@ANI) April 26, 2024