CM Jagan : కేబినెట్ భేటీలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు.. త్వరలో ఏపీ మంత్రివర్గ విస్తరణ

పదవి నుండి తప్పించిన వారికి జిల్లా ఇంచార్జ్ బాధ్యతలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కొంత మంది మంత్రివర్గంలో ఉంటారని సీఎం జగన్ చెప్పారు.

CM Jagan key comments : ఏపీలో త్వరలో కేబినెట్ విస్తరణ జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ మేరకు కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మంత్రులకు సీఎం జగన్ చెప్పారు. మంత్రివర్గం నుండి తప్పించిన వారు పార్టీకి పని చెయ్యాలని ఈ సందర్భంగా చెప్పారు.

పదవి నుండి తప్పించిన వారికి జిల్లా ఇంచార్జ్ బాధ్యతలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కొంత మంది మంత్రివర్గంలో ఉంటారని సీఎం జగన్ చెప్పారు. ఈ నేపథ్యంలో కేబినెట్ లో ఎవరెవరు ఉంటారు? ఎవరెవరనీ తొలగిస్తారనేదానిపై ఉత్కంఠ నెలకొంది. మంత్రివర్గం నుంచి ఎవరికి ఉద్వాసన పలుకనున్నారోననే ఆందోళన మంత్రుల్లో నెలకొంది.

AP Cabinet approves: కీల‌క చ‌ట్టాల‌ స‌వ‌ర‌ణ‌లకు ఏపీ కేబినెట్ ఆమోదం..రెండో భాష‌గా ఉర్దూ

ఏపీ అసెంబ్లీలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఇవాళ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రూ.2,56,257 కోట్లతో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,08,261 కోట్లు, మూలధన వ్యయం రూ.47,996 కోట్లు, రెవెన్యూ లోటు రూ.17,036 కోట్లు.

ద్రవ్య లోటు రూ.48,724 కోట్లు, జీఎస్డీపీలో రెవెన్యూ లోటు అంచనా 1.27 శాతం, జీఎస్డీపీలో ద్రవ్య లోటు 3.64 శాతం, 1.34 లక్షల గ్రామ, వార్డుల సచివాలయ నియామకాలు, జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇతర ఖాళీల భర్తీ చేస్తామని పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు