WhatsApp Users : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై మీ ఫొటోలు, వీడియోలను హైక్వాలిటీతో అప్‌‌లోడ్ చేయొచ్చు

WhatsApp Users : వాట్సాప్ బీటా లేటెస్ట్ వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసే కొంతమంది బీటా టెస్టర్‌లకు మీడియా అప్‌లోడ్ క్వాలిటీని పొందే ఫీచర్ అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో వాట్పాప్ యూజర్లందరికి అందుబాటులోకి రానుంది.

WhatsApp Users Can Now Manage Upload Quality Of Photos And Videos ( Image Credit : Google )

WhatsApp Users : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్ల కోసం ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొచ్చింది. మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ అప్లికేషన్ మీడియా అప్‌లోడ్ క్వాలిటీని అందించే అద్భుతమైన ఒక ఫీచర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు నివేదించింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ ఫొటోలు, వీడియోలలోని ముఖ్యమైన వివరాలు ఎల్లప్పుడూ సెక్యూర్‌గా ఉంచుకోవచ్చు.

Read Also : Vivo S19 Pro Series : ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వివో S19 ప్రో సిరీస్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

అంతేకాదు.. ఫైల్స్ షేర్ చేయడంపై కంట్రోల్ కలిగి ఉంటారు. ప్రస్తుతం, టెస్ట్‌ఫ్లైట్ యాప్ నుంచి ఐఓఎస్ వాట్సాప్ బీటా లేటెస్ట్ వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసే కొంతమంది బీటా టెస్టర్‌లకు మీడియా అప్‌లోడ్ క్వాలిటీని పొందే ఫీచర్ అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో వాట్పాప్ యూజర్లందరికి అందుబాటులోకి రానుంది.

వాట్సాప్ బీటా వెర్షన్ అప్‌డేట్ ఇదే :
ఆండ్రాయిడ్ బీటాలో ఈ ఫీచర్‌ని టెస్టింగ్ చేసిన తర్వాత వాట్సాప్ ఇప్పుడు ఐఓఎస్ యూజర్లకు మీడియా అప్‌లోడ్ క్వాలిటీని మేనేజ్ చేసే అవకాశాన్ని అందించాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. టెస్ట్ ఫైట్ యాప్‌లో అందుబాటులో ఉన్న iOS 24.11.10.78 వెర్షన్ లేటెస్ట్ వాట్సాప్ బీటాను కలిగి ఉంది. వాట్సాప్ మీడియా అప్‌లోడ్ క్వాలిటీ కోసం ఈ ఫీచర్‌ను రిలీజ్ చేస్తోందని నివేదిక వెల్లడించింది. ఈ నివేదికలో షేర్ చేసిన స్క్రీన్‌షాట్ ఫొటోలు, వీడియోల డిఫాల్ట్ క్వాలిటీని ఎంచుకోవడానికి కొత్త ఆప్షన్ వెల్లడించింది. ఇప్పుడు ఐఓఎస్ యాప్‌లోని స్టోరేజీ, డేటా సెక్షన్‌లోఅందుబాటులో ఉంది.

ఒరిజినల్ క్వాలిటీతో నేరుగా షేర్ చేయలేరు :
ప్రామాణిక క్వాలిటీ ఆప్షన్ ఎంచుకోవడం వల్ల చిన్న ఫైల్ సైజులతో వేగంగా షేర్ చేయడానికి అనుమతిస్తుంది. అయితే, హై క్వాలిటీ ఆప్షన్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసి ముఖ్యమైన వివరాలను స్టోర్ చేస్తుంది. అయినప్పటికీ, హై క్వాలిటీ ఆప్షన్‌తో వినియోగదారులు మీడియాను ఒరిజినల్ క్వాలిటీతో నేరుగా షేర్ చేయలేరు.

ఫొటోలు, వీడియోలను వాటి ఒరిజినల్ క్వాలిటీలో షేర్ చేయడానికి వినియోగదారులు వాటిని డాక్యుమెంట్లుగా పంపాలి. ఈ ఫీచర్ ప్రతి ఇమేజ్‌లు, వీడియోల కోసం సెట్టింగ్‌లను మాన్యువల్‌గా ఎడ్జిస్ట్ చేయవలసిన అవసరాన్ని తొలగిస్తుంది. తద్వారా గణనీయమైన ప్రయోజనాలను అందిస్తుంది. యూజర్ ఎక్స్‌పీరియన్స్ సౌలభ్యం కోసం సెక్యూరిటీ లేయర్ యాడ్ చేసినట్టు నివేదిక తెలిపింది.

6 రెట్లు లార్జ్ ఫైల్స్ పంపొచ్చు :
ఈ ఫీచర్ తమ మీడియా అప్‌లోడ్‌లలో స్పీడ్ కన్నా క్వాలిటీకి ప్రాధాన్యతనిచ్చే యూజర్ల ఆందోళనలను పరిష్కరించనుంది. అంతేకాదు.. షేరింగ్ ప్రక్రియను చివరకు మెరుగుపరుస్తుందని విశ్వసిస్తున్నామని వాట్సాప్ నివేదిక తెలిపింది. వాట్సాప్ యూజర్లు ఫొటోలు లేదా వీడియోలను స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో షేర్ చేసినప్పుడు అప్‌లోడ్ క్వాలిటీ మార్చుకోవచ్చు.

హై క్వాలిటీ సెట్టింగ్‌తో వినియోగదారులు మీడియా ఫైల్‌లను 6 రెట్లు లార్జ్ ఫైల్స్ పంపగలరు. కానీ పెద్ద ఫైల్ సైజు, మెరుగైన రిజల్యూషన్ కారణంగా పంపడానికి ఎక్కువ సమయం పడుతుంది. అయితే, అప్‌లోడ్ చేయడానికి, షేర్ చేయడానికి దీనికి మరింత సమయంతో పాటు డేటా అవసరమని గమనించాలి.

Read Also : New Rules From June 2024 : డ్రైవింగ్ లైసెన్స్‌, ఆధార్ కార్డ్ అప్‌డేట్‌ చేశారా? జూన్ 1 నుంచి కొత్త రూల్స్.. తప్పక తెలుసుకోండి!