Aaraa Exit Poll : ఏపీ ఎన్నికల్లో ఈసారి గెలిచే వారు ఎవరు? ఓటమి చవి చూసే వారు ఎవరు? పవన్ కల్యాణ్, నారా లోకేశ్ భవితవ్యం ఏంటి? వైసీపీలో ఓడిపోనున్న ప్రముఖులు ఎవరెవరు? ఆరా సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్స్ లో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఏపీ ఎన్నికలపై ఆరా సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు విడుదల చేసింది.
ఆరా అంచనా ప్రకారం ఏపీలో గెలిచేది ఓడేది వీళ్లే..!
నర్సాపురం, అనకాపల్లి నుంచి బీజేపీ అభ్యర్థులు గెలుపు
పురంధేశ్వరి రాజమండ్రిలో గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు, గెలుపుకి ఓటమికి సమాన అవకాశాలు ఉన్నాయి
రాజంపేటలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఓటమి
విజయవాడ పశ్చిమలో సుజనా చౌదరి మంచి మెజార్టీతో గెలవబోతున్నారు
కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్ గెలవబోతున్నారు
విశాఖపట్నం నార్త్ లో విష్ణుకుమార్ రాజు గెలిచే అవకాశం
జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో, 2 లోక్ స్థానాల్లో పోటీ చేయగా..
2 పార్లమెంట్ స్థానాల్లో గెలవబోతోంది
పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారు
నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి గెలవబోతున్నారు
తెలుగుదేశం పార్టీ
చంద్రబాబు కుప్పంలో భారీ మెజార్టీతో గెలవబోతున్నారు
నారా లోకేశ్ మంగళరిలో గెలవబోతున్నారు
హిందూపురంలో బాలకృష్ణ మంచి మెజార్టీతో గెలవబోతున్నారు
మంత్రివర్గంలో ఉన్న అనేకమంది తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్నారు, కొందరు ఓటమి చవిచూడనున్నారు
వైఎస్ జగన్ పులివెందులలో భారీ మెజార్టీతో గెలవబోతున్నారు
మంత్రి సీదిరి అప్పలరాజు పలాసలో ఓటమి
శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు గట్టి పోటీ ఎదుర్కోబోతున్నారు
రాజన్న దొర గెలుపొందబోతున్నారు
బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నుంచి గెలవబోతున్నారు
మంత్రి గుడివాడ అమర్నాథ్ గాజువాకలో ఓటమి చవిచూడబోతున్నారు
పినిపె విశ్వరూప్ అమలాపురంలో గెలవబోతున్నారు
కారుమూరి నాగేశ్వరరావు తణుకులో ఓటమి చవిచూడబోతున్నారు
చెల్లబోయిన వేణుగోపాల్ రాజమండ్రి రూరల్ లో ఓటమి చవిచూడబోతున్నారు
దాడిశెట్టి రాజా గెలవబోతున్నారు
మంత్రి కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెంలో ఓటమి చవిచూడనున్నారు
మంత్రి తానేటి వనిత గోపాలపురంలో స్వల్ప ఆధిక్యంతో గెలవబోతున్నారు
మంత్రి జోగి రమేశ్ పెనమలూరులో గట్టి పోటీ
మంత్రి అంబటి రాంబాబు సత్తెనపల్లిలో గట్టి పోటీ ఎదుర్కోనబోతున్నారు
విడదల రజిని గుంటూరు వెస్ట్ లో స్వల్ప తేడాతో ఓటమి చవి చూసే అవకాశం
ఆదిమూలపు సురేశ్ కొండెపిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవి చూసే అవకాశం
మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లిలో గెలిచే అవకాశం
మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డోన్ లో గెలిచే అవకాశం
కె అంజద్ బాషా కడపలో గెలిచే అవకాశం
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో భారీ మెజార్టీతో గెలిచే అవకాశం
ఉషశ్రీ చరణ్ పెనుకొండలో అతి స్వల్ప తేడాతో ఓటమి చవిచూసే అవకాశం
గుమ్మనూరు జయరాం గుంతకల్లులో ఓటమి చవిచూసే అవకాశం
మంత్రి ఆర్కే రోజా నగరిలో ఓటమి చవిచూడబోతున్నారు
అచ్చెన్నాయుడు టెక్కలిలో స్వల్ప ఆధిక్యతతో విజయం సాధించబోతున్నారు
నెల్లూరు లోక్ సభ స్థానంలో విజయసాయిరెడ్డి ఓటమి చవిచూడబోతున్నారు
Also Read : వైసీపీదే గెలుపు? భారీ మెజార్టీతో పవన్ విజయం? ఆరా మస్తాన్ సంచలన సర్వే