వైసీపీదే గెలుపు? భారీ మెజార్టీతో పవన్ విజయం? ఆరా మస్తాన్ సంచలన సర్వే

56శాతం మహిళలు వైసీపీకి ఓటు వేశారు. 55.6 శాతం పురుషులు టీడీపీకి ఓటు వేశారు.

వైసీపీదే గెలుపు? భారీ మెజార్టీతో పవన్ విజయం? ఆరా మస్తాన్ సంచలన సర్వే

Updated On : June 1, 2024 / 9:01 PM IST

Aaraa Exit Poll on AP Elections 2024 : ఏపీ ఎన్నికల ఫలితాలపై ఆరా మస్తాన్ సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసింది. ఏపీలో గెలిచేది ఎవరో ఆరా చెప్పేసింది. ఆంధ్రప్రదేశ్ లో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆరా అంచనా వేసింది. ఆరా సర్వే ప్రకారం.. వైసీపీ 94-104 అసెంబ్లీ స్థానాల్లో గెలవనుంది. టీడీపీ కూటమి 71-81 స్థానాలకే పరిమితం కానుంది. మెజార్టీ సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో టీడీపీ కూటమికే పట్టం కట్టాయి. అందుకు భిన్నంగా ఆరా మస్తాన్ సర్వే రిపోర్టు ఉంది. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా.. అసలు ఫలితం ఎలా ఉంటుందో జూన్ 4న తెలియనుంది.

ఆరా మస్తాన్ పోస్ట్ పోల్ ఫలితాలు..
* కూటమికి ఓటు శాతం, సంఖ్యా బలం పెరిగింది
* మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఓటమి
* సుజనా చౌదరి గెలిచే అవకాశం
* కామినేని, విష్ణు కుమార్ రాజు విజయం
* జనసేనకు రెండు పార్లమెంటు స్థానాలు
* పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ ఘన విజయం
* నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ గెలుపు
* మంత్రి సిదిరి అప్పలరాజు ఓటమి
* మంత్రి బొత్స సత్యనారాయణ గెలుపు అవకాశం
* మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఓటమి

* మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ ಓటమి
* మంత్రి తానేటి వనిత గెలవబోతున్నారు
* జోగి రమేశ్, అంబటి రాంబాబు గట్టి పోటీ
* రజని గట్టి పోటీ ఇచ్చారు. స్వల్ప ఓట్లతో ಓటమి పాలయ్యే అవకాశం.
* ఆదిమూలపు సురేశ్ ఓటమి చెందే అవకాశం
* మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గెలిచే అవకాశం
* మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలుపు అవకాశం
* గుమ్మనూరి జయరాం ఓటమి
* మంత్రి రోజా ఓడిపోబోతున్నారు
* అచ్చెన్నాయుడు, వల్లభనేని వంశీ గెలుపు అవకాశం
* రఘురామ క్రిష్ణరాజు గెలుపు అవకాశం
* ఎంపీ విజయసాయిరెడ్డి ఓటమి పాలయ్యే అవకాశం

* వైసీపీకి గ్రామ వాలంటీర్ల వ్యవస్థ బాగా పనులు జరిగాయి
* 56శాతం మహిళలు వైసీపీకి ఓటు వేశారు
* పురుషులు 55.6 శాతం టీడీపీకి ఓటు వేశారు
* వైసీపీ అధికారంలోకి రాబోతోంది.
* 94 నుండి 104 సీట్లు వైసీపీకి వచ్చే అవకాశం
* 71 నుండి 81 సీట్లు టీడీపీకి వచ్చే అవకాశం
* 13 నుండి 15 పార్లమెంట్ స్థానాలు వైసీపీకి వచ్చే అవకాశం
* వైఎస్ షర్మిలకు డిపాజిట్లు కూడా రావు
* జనసేన ‌14 నుంచి 15 సీట్లు గెలిచే అవకాశం

* విశాఖ, గుంటూరు పార్లమెంట్‌ స్థానాలు రాజధాని వల్ల వైసీపీ నష్టపోబోతుంది.
* నరసరావుపేట పార్లమెంట్ లో చివరి రౌండ్ వరకు గట్టిపోటీ ఉంటుంది.

Also Read : గెలుపుపై వైసీపీ ధీమాకు కారణమేంటి? విజయంపై కూటమి కాన్ఫిడెన్స్ ఏంటి?