Vijayawada News: ఇంద్రకీలాద్రి పై కరోనా కలకలం

విజయవాడలోని ప్రముఖ దైవక్షేత్రం కనకదుర్గమ్మ ఆలయంలో కరోనా కలకలం రేగింది. ఆలయ అర్చకుడొకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

Vijayawada News: కృష్ణాజిల్లా విజయవాడలోని ప్రముఖ దైవక్షేత్రం కనకదుర్గమ్మ ఆలయంలో కరోనా కలకలం రేగింది. ఆలయ అర్చకుడొకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆలయంలో పనిచేస్తున్న మిగతా అర్చకులు, సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. దుర్గమ్మ గుడిలో కరోనా కలకలం రేగడంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న ద్రుష్ట్యా అంతరాలయ దర్శనాన్ని తాత్కాలికంగా రద్దు చేశారు. ఇక ఇంద్రకీలాద్రి పై కరోనా కలకలంరేగడంపై దుర్గగుడి ఈఓ భ్రమరాంబ స్పందించారు. ఆలయ అర్చకుల్లో ఒకరికి కరోనా నిర్ధారణ అవడంతో.. భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నట్టు భ్రమరాంబ వెల్లడించారు.

Also read: EV Charging: దేశంలో ఎవరైనా ఎక్కడైనా విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకోవచ్చు

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భక్తులు రాక కూడా తగ్గిందని, పండుగ సమయం కావడంతో కొంతమంది భక్తులు మాత్రమే అమ్మవారి దర్శనానికి వస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. క్యూ లైనల్లో ఎప్పటి కప్పుడు శానిటైజేషన్ చేస్తున్నామని, దర్శనానికి వచ్చే భక్తులు మాస్క్ లు తప్పనిసరిగా ధరించి, స్వీయ నియంత్రణ పాటించాలని ఈవో భ్రమరాంబ సూచించారు. ఇక దేశంలో కరోనా మరోసారి విలయతాండవం చేస్తుంది. దేశ వ్యాప్తంగా గత రెండు రోజులుగా 2 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కోరలు చాస్తోంది.

Other Stories: TS Schools: జనవరి 30 వరకు తెలంగాణలో విద్యాసంస్థలు బంద్

ట్రెండింగ్ వార్తలు