Sajjala Ramakrishna Reddy and Chandrababu Naidu
Sajjala Ramakrishna Reddy: టీడీపీ నేతలపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. టీడీపీ నేతలు మనుషులా రాక్షసులా అంటూ ఘాటుగా ప్రశ్నించారు. వీళ్లకు సిగ్గుశరం ఉందా? టీడీపీ ఒక రాజకీయ పార్టీనా? అంటూ సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్టుపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని, యాక్టుపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. అలాంటప్పుడు గతంలో ఈ యాక్టుకు అసెంబ్లీలో టీడీపీ ఎందుకు మద్దతు ఇచ్చిందని సజ్జల ప్రశ్నించారు.
Also Read : Chiranjeevi : ఏపీ రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు.. పిఠాపురంలో ప్రచారంపై క్లారిటీ
2019 జులై 29న ల్యాండ్ టైట్లింగ్ యాక్టు బిల్లుకు టీడీపీ మద్దతు ఇచ్చింది. ఈ యాక్ట్ వల్ల నష్టం జరిగే అవకాశం ఉంటే ఎందుకు టీడీపీ మద్దతు ఇచ్చిందని సజ్జల ప్రశ్నించారు. ఈ యాక్ట్ చెత్తదని, దీన్ని రద్దు చేస్తామని ప్రధాని మోదీ, అమిత్ షాతో ఒక స్టేట్ మెంట్ ఇప్పించండి అంటూ చంద్రబాబుకు రామకృష్ణారెడ్డి సవాల్ చేశారు. ఎన్నికల ముందు విష ప్రచారానికి తెరలేపారు. చంద్రబాబు అండ్ ముఠా అత్యంత దిగజారుడు రాజకీయాలు చేస్తూ.. ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబుకు సమాజంలో ఉండటానికి అర్హత లేదంటూ సజ్జల అన్నారు.
Also Read : Navneet Kaur Rana : షాద్‌నగర్ పీఎస్‌లో బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్‌పై కేసు నమోదు.. ఎందుకంటే?
డీబీటీ నిధుల పంపిణీపై సజ్జల స్పందించారు. ఈసీ లేవనెత్తిన ప్రశ్నలు వారి అధికార పరిధిలోకి రావని అన్నారు. గతంలో టీడీపీ పసుపుకుంకుమ పథకానికి ఈసీ ఎందుకు అనుమతి ఇచ్చిందని అన్నారు. డీబీటీ నిధుల పంపిణీపై హైకోర్టు ఆదేశాల అనంతరం ఈసీ నుంచి క్లారిఫికేషన్ వచ్చిన తరువాత నిధులు విడుదల అవుతాయని సజ్జల చెప్పారు.