YS Jagan : ప్రజాసంకల్ప యాత్రకు నాలుగేళ్లు

ఏపీ వ్యాప్తంగా సాగించిన జగన్ ప్రజా సంకల్ప యాత్ర నేటితో నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు పలు కార్యాక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

Praja Sankalpa Yatra: ఏపీ వ్యాప్తంగా సాగించిన జగన్ ప్రజా సంకల్ప యాత్ర నేటితో నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు పలు కార్యాక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇడుపుల పాయలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి 2017 నవంబర్‌ 6న జగన్ పాదయాత్ర ప్రారంభమైంది. రాష్ట్రంలో13 జిల్లాలను దాటుకుంటూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9న ముగిసింది. 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2 వేల 5 వందల 16 గ్రామాల మీదుగా జగన్‌ పాదయాత్ర సాగింది. అలాగే 341 రోజుల పాటు 3 వేల 6 వందల 48 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. 124 చోట్ల సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు.

Read More : Telangana : జిల్లాల పర్యటనకు సీఎం కేసీఆర్

క్షేత్ర స్థాయిలో రాష్ట్రం నలుమూలలా జగన్‌ పాదయాత్ర చేశారు. ఎండల తీవ్రతను, భారీ వర్షాలను, వణికించే చలిని ఇలా అన్ని కాలాల్లోనూ పాదయాత్ర సాగించారు. ఎన్నో అటుపోట్లు ఎదుర్కొని ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 151 అసెంబ్లీ సీట్లతో తిరుగులేని విజయం దక్కించుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారు. ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఇచ్చిన హామీలు, వాటిని అమలు చేస్తున్నామని చెబుతోంది ప్రభుత్వం.

ట్రెండింగ్ వార్తలు