Rohit Sharma : మీడియా స‌మావేశం అనంత‌రం నేరుగా రింకూసింగ్ వ‌ద్ద‌కు వెళ్లిన రోహిత్ శ‌ర్మ‌..

భార‌త జ‌ట్టులో న‌యా ఫినిష‌ర్ రింకూసింగ్‌కు చోటు ద‌క్క‌లేదు.

Rohit Sharma – Rinku Singh : వెస్టిండీస్, అమెరికా లు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వ‌నున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో పాల్గొనే భార‌త జ‌ట్టులో న‌యా ఫినిష‌ర్ రింకూసింగ్‌కు చోటు ద‌క్క‌లేదు. భార‌త కాల‌మానం ప్ర‌కారం జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ కోసం బీసీసీఐ ఇటీవ‌ల జ‌ట్టును ప్ర‌క‌టించింది. 15 మంది స‌భ్యుల గ‌ల బృందంలో రింకూ సింగ్‌కు స్థానం ల‌భించ‌లేదు. కేవ‌లం రిజ‌ర్వు ఆట‌గాడిగా ప్ర‌క‌టించారు.

ప్ర‌పంచ‌క‌ప్‌లో కొంద‌రు ఆట‌గాళ్ల‌ను తీసుకోక‌పోవ‌డానికి గ‌ల కార‌ణాల‌ను వివ‌రిస్తూ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, చీఫ్ సెల‌క్ట‌ర్ అజిత్ అగార్క‌ర్ లు మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి వివ‌రించారు. కాగా.. ఈ స‌మావేశం అనంత‌రం నేరుగా రోహిత్ శ‌ర్మ వాంఖ‌డే స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న రింకూ సింగ్ వ‌ద్ద‌కు వ‌చ్చాడు. అత‌డితో చాలా సేపు చ‌ర్చించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియ‌న్స్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Kavya Maran : ఆఖ‌రి బంతికి స‌న్‌రైజ‌ర్స్ విజ‌యం.. ఎగిరిగంతులేసిన కావ్య పాప‌.. వైర‌ల్‌

ఆ వీడియోలో రోహిత్ శర్మ త‌న వ‌ద్ద‌కు వ‌స్తుండ‌డాన్ని చూసిన రింకూ సింగ్ చిరున‌వ్వుతో అత‌డిని ప‌ల‌క‌రించాడు. ఆ త‌రువాత ఇద్ద‌రూ చాలా సిరీస్‌గా మాట్లాడుకున్నారు. పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో ఎందుకు అత‌డికి తీసుకోలేక‌పోయారో అన్న విష‌యాన్ని రోహిత్ శ‌ర్మ వివ‌రించి ఉండొచ్చు.

టీమ్ఇండియా త‌రుపున రింకూ సింగ్ 15 టీ20 మ్యాచులు ఆడాడు. 89 స‌గ‌టుతో 176.24 స్ట్రైక్‌రేటుతో 356 ప‌రుగులు చేశాడు. అయిన‌ప్ప‌టికీ అత‌డికి ప్ర‌పంచ‌క‌ప్‌లో చోటు ద‌క్క‌లేదు. ఈ విష‌యంపై అగార్క‌ర్ మాట్లాడుతూ తాము తీసుకున్న క‌ఠిన నిర్ణ‌యాల్లో ఇది ఒక‌టి అని చెప్పాడు. కెప్టెన్‌కు మ‌రిన్ని ప్ర‌త్యామ్నాయాల‌ను ఇచ్చేందుకు న‌లుగురు స్పిన్న‌ర్ల‌ను ఎంపిక చేసిన‌ట్లు తెలిపాడు. ఇందులో రింకూ సింగ్ త‌ప్పేమీ లేద‌న్నాడు. అత‌డు రిజ‌ర్వ్ ఆట‌గాళ్ల జాబితాలో ఉన్నాడ‌ని, 15 మందిలో ఉండ‌డానికి అత‌డు ఎంత చేరువ‌లో ఉన్నాడో దీన్ని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చున‌ని తెలిపాడు.

Suresh Raina : టీమ్ఇండియా మాజీ క్రికెట‌ర్ సురేశ్ రైనా ఇంట్లో తీవ్ర విషాదం..

ఇదిలా ఉంటే.. రింకూ సింగ్ ఐపీఎల్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ త‌రుపున‌, రోహిత్ శ‌ర్మ ముంబై ఇండియ‌న్స్ త‌రుపున ఆడుతున్నారు. ముంబైలోని వాంఖ‌డే వేదిక‌గా శుక్ర‌వారం కేకేఆర్‌, ముంబై జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇరు జ‌ట్లు మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే స‌మావేశం అనంత‌రం రోహిత్ నేరుగా రింకూ వ‌ద్ద‌కు వెళ్లాడు.

ట్రెండింగ్ వార్తలు