Chandrababu Arrest : చంద్రబాబు అరెస్టుకు నిసనగా ఐటీ ఉద్యోగులు కార్ల ర్యాలీ, ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో భారీగా పోలీసులు మోహరింపు

విజయవాడలో ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీకి అనుమతి లేదని ఏపీ పోలీసు అధికారులుస్పష్టం చేశారు.

IT employees car rally : చంద్రబాబు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు వారి ఆందోళనలను అడ్డుకోవటం.. ఆ తరువాత కార్లలో ఔటర్ రింగ్ రోడ్డుమీదకు ఫ్యామిలీలతో సహా వచ్చి నిసనలు తెలిపారు. ఈక్రమంలో చంద్రబాబు అరెస్టుకు నిసనగా హైదరాబాద్ ఐటీ ఉద్యోగులు నగరం నుంచి ఏపీలోని రాజమండ్రి వరకు కార్లలో ర్యాలీ నిర్వహించాలని ప్లాన్ వేసుకున్నారు. దీని కోసం వాట్సాప్ గ్రూపుల్లో కో ఆర్డినేషన్ చేసుకుని వీకెండ్ లో ర్యాలీ నిర్వహించాలని ప్లాన్ చేసుకున్నారు.

ఈ విషయాన్ని ఏపీ పోలీసులు పసిగట్టారు. వాట్సాప్ గ్రూపుల్లో సమాచారం ద్వారా విషయాన్ని సేకరించి అప్రమత్తమయ్యారు. ఐటీ ఉద్యోగుల ర్యాలీని అడ్డుకోవటానికి ఏపీ పోలీసులు అర్థరాత్రి నుంచి ఏపీ తెలంగాణ సరిహద్దులో భారీగా మోహరించారు. ప్రతీ కారును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ ఐటీ ఉద్యోగులు ‘కారులో సంఘీభావ యాత్ర’ పేరుతో ర్యాలీ చేపట్టారు. రాజమండ్రి చేరుకున్నాక చంద్రబాబు భార్య నారా భువనేశ్వరిని కలిసి సంఘీభావం తెలిపేందుకు ప్లాన్ చేసుకుని బయలుదేరారు. ఈ విషయాన్ని గుర్తించిన ఏపీ పోలీసులు ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో అర్థరాత్రి నుంచి భారీగా మోహంరించారు. పలు అంచెలుగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన ఐటీ ఉద్యోగులను అడ్డుకున్నారు.

కాగా..విజయవాడలో ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీకి అనుమతి లేదని స్పష్టం చేశారు. కార్లతో సంఘీభావ యాత్రకు అనుమతి ఇవ్వడం కుదరదన్నారు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి. తమ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇలాంటి యాత్రలకు అనుమతులు లేవని వివరించారు. నిబంధనలను అతిక్రమించినవారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ర్యాలీ నిర్వహిస్తే పలు సెక్షన్ల కింద కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

కాగా స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో అవినీతి జరిగిందనే ఆరోపణలతో టీడీపీ అధినేత చంద్రబాబుని అరెస్ట్ చేయటం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంచటం జరిగింది. దీంతో చంద్రబాబు అరెస్టును నిరసిస్తు ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా నిరసనలు జరిగాయి. అంతేకాదు విదేశాల్లో కూడా ఎంతోమంది ఆందోళనలు చేపట్టారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ ఉద్యోగులు నిరసనలు, సంఘీభావ ప్రదర్శనలు చేపడుతున్న సంగతి తెలిసిందే.

 

ట్రెండింగ్ వార్తలు