వైసీపీ కార్యాలయాల కూల్చివేతల కేసు.. తీర్పు రిజర్వ్

విజయవాడ, బాపట్ల, నరసరావుపేట, పార్వతీపురం, విశాఖపట్నం, రాయచోటి తదితర ప్రాంతాల్లో దాదాపు 11 చోట్ల వైసీపీ కార్యాలయాలకు నోటీసులు అందాయి.

Ysrcp Party Office Buildings : వైసీపీ కార్యాలయాల కూల్చివేత చర్యలపై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది. తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు యధాస్థితి కొనసాగించాలని ఆదేశించిన కోర్టు.. స్టేటస్ కో ఆదేశాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఏపీలో పలు చోట్ల వైసీపీ కార్యాలయాలు అక్రమంగా నిర్మించారని, ఎటువంటి నిబంధనలు పాటించలేదని, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైపోయాయని ఆరోపిస్తూ నోటీసులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. అంతేకాదు విజయవాడలో నిర్మాణంలో ఉన్న వైసీపీ రాష్ట్ర కార్యాలయాన్ని కూల్చివేశారు.

ఈ నేపథ్యంలో వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై నిన్న విచారణ జరిపిన కోర్టు.. స్టేటస్ కో ఆదేశాలు ఇచ్చింది. ఇవాళ్టి వరకు ఎటువంటి చర్యలు చేపట్టొద్దని, నిర్మాణాలను కూల్చివేయొద్దని ఆదేశించింది. తర్వాత దీనికి సంబంధించిన విచారణ ఇవాళ జరిపిన కోర్టు.. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశిస్తూ తీర్పును రిజర్వ్ లో పెట్టింది. విజయవాడ, బాపట్ల, నరసరావుపేట, పార్వతీపురం, విశాఖపట్నం, రాయచోటి తదితర ప్రాంతాల్లో దాదాపు 11 చోట్ల వైసీపీ కార్యాలయాలకు నోటీసులు అందాయి. ఈ నిర్మాణాలను కూల్చివేసేందుకు టీడీపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోంది అంటూ కోర్టును ఆశ్రయించింది వైసీపీ.

Also Read : ఒక్క ఓటమితో సీన్ రివర్స్..! చంద్రబాబును కుప్పంలో అడుగు పెట్టనీయనని భారీ డైలాగ్‌లు, కట్ చేస్తే..

ట్రెండింగ్ వార్తలు