వరుస సమీక్షలతో బిజీబిజీ.. పాలనపై పట్టు పెంచుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఈ రెండు విభాగాలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రానున్న రోజుల్లో ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి పవన్ కల్యాణ్ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

Deputy Cm Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వరుస సమీక్షలతో బిజీబిజీగా ఉన్నారు. తనకు కేటాయించిన శాఖలను పూర్తిగా అధ్యయనం చేస్తున్నారు. శాఖలపై పూర్తిగా అవగాహన తెచ్చుకునేందుకు లోతుగా అధ్యయనం చేస్తున్నారు. శాఖల స్థితిగతులు, నిధులు, కొత్తగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై పవన్ సమీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు.

డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా వరుసగా తనకు కేటాయించిన కీలకమైన శాఖలకు సంబంధించి వరుస సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చాలా బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రతిరోజు కూడా తన క్యాంప్ కార్యాలయంలో అన్ని శాఖలకు సంబంధించి శాఖల్లో ఉన్న విభాగాలకు సంబంధించి ఆయన ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.

తాజాగా గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీ రాజ్.. ఈ రెండు డిపార్ట్ మెంట్లకు సంబంధించిన ఇంజినీరింగ్ విభాగం ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ రెండు విభాగాలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రానున్న రోజుల్లో ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి పవన్ కల్యాణ్ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. వీటితో పాటు మిగిలిన అన్ని శాఖలకు సంబంధించి పూర్తిగా అధ్యయనం చేస్తున్నారు పవన్ కల్యాణ్.

ప్రతి శాఖ, అందులో ఉన్న విభాగాలకు సంబంధించి వేర్వేరుగా అధికారులను పిలిపించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా తీసుకుంటున్నారు పవన్ కల్యాణ్. నిన్న స్వచ్చాంధ్ర కార్పొరేషన్ కు సంబంధించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ తీసుకున్నారు. అంతకుముందు మున్సిపాలిటీకి సంబంధించి గ్రామీణాభివృద్ధి, మున్సిపాలిటీల్లో నీటి సరఫరా అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ తీసుకున్నారు పవన్ కల్యాణ్.

తనకు కేటాయించిన శాఖలను పూర్తిగా అధ్యయనం చేసి, ఆ శాఖల స్థితిగతులను తెలుసుకోవడంతో పాటు ఆయా శాఖల్లో ఎంతమేర నిధులు ఉన్నాయి? ఏ విధంగా ఖర్చు పెట్టారు? ఎన్ని నిధులు మళ్లించారు? నిధులను ఎక్కడికి, ఎలా మళ్లించారు? వీటన్నింటికి సంబంధించి చాలా క్లియర్ గా తెలుసుకుంటున్నారు పవన్ కల్యాణ్. ఈ వివరాలన్నీ తెలుసుకుని శాఖలను అధ్యయనం చేసిన తర్వాతే తనదైన శైలిలో కొత్త నిర్ణయాలు, కొత్త సంస్కరణలు తీసుకునేందుకు పవన్ కల్యాణ్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

Also Read : ఒక్క ఓటమితో సీన్ రివర్స్..! చంద్రబాబును కుప్పంలో అడుగు పెట్టనీయనని భారీ డైలాగ్‌లు, కట్ చేస్తే..

ట్రెండింగ్ వార్తలు