ఆ ఉద్యోగులకు 5 రోజుల డ్యూటీ మరో ఏడాది పొడిగింపు.. చంద్రబాబు కీలక నిర్ణయం

Chandrababu Naidu: హైదరాబాద్ నుంచి వచ్చే ఉద్యోగుల సౌకర్యార్థం శనివారం సెలవు ఇస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ సచివాలయం, హెచ్ఓడీ ఉద్యోగులకు 5 రోజుల డ్యూటీని మరో ఏడాది కొనసాగించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదముద్ర వేశారు. రాష్ట్ర విభజన తర్వాత అమరావతి నుంచి చంద్రబాబు పాలన ప్రారంభించినప్పటి నుంచి ఆయా ఉద్యోగులు వారానికి 5 రోజులు మాత్రమే విధులు చేసేట్లుగా చంద్రబాబు వెసులుబాటు ఇచ్చారు.

హైదరాబాద్ నుంచి వచ్చే ఉద్యోగుల సౌకర్యార్థం శనివారం సెలవు ఇస్తున్నారు. ఇందుకు సంబంధించిన జీవో నేటితో ముగిసింది. దీంతో దీన్ని మరో ఏడాది కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు సంతకం చేయడంతో ఈ మేరకు ఇవాళ ఏపీ సర్కారు జీవో విడుదల చేయనుంది.

వారానికి 5 రోజుల డ్యూటీని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్న చంద్రబాబు నాయుడికి ఏపీ సెక్రటేరియట్ అసోషియేషన్ కృతజ్ఞతలు తెలిపింది. కాగా, రాష్ట్ర విభజన జరిగిన అనంతరం ఏపీ ఉద్యోగులు కొన్ని నెలలపాటు హైదరాబాద్ లోనే పనిచేసిన విషయం తెలిసిందే. అనంతరం ఉద్యోగులను అమరావతికి తరలించాలని అప్పట్లో టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అమలు చేసింది.

Also Read: మేము ప్రతీకారం తీర్చుకోవాలంటే ఎంతోమందిని అరెస్టు చేయవచ్చు.. కానీ..: హోంమంత్రి అనిత

ట్రెండింగ్ వార్తలు