Nara Lokesh: ఆ ఏడుగురు ఎమ్మెల్యేలపై లోకేశ్ సీరియస్.. పార్టీ, ప్రభుత్వానికి నష్టం అంటూ ఫైర్

పెరోల్ లాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని హోంమంత్రి అనితకు లోకేశ్ సూచించారు. కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి.. (Nara Lokesh)

Nara Lokesh: ఆ ఏడుగురు ఎమ్మెల్యేలపై లోకేశ్ సీరియస్.. పార్టీ, ప్రభుత్వానికి నష్టం అంటూ ఫైర్

Nara Lokesh

Updated On : August 21, 2025 / 5:21 PM IST

Nara Lokesh: పలువురు టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై మంత్రి లోకేశ్ సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యేల వివాదాస్పద ఘటనలకు సంబంధించి మంత్రుల దగ్గర లోకేశ్ ప్రస్తావించారు. దగ్గుబాటి ప్రసాద్, కూన రవి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నజీర్ అహ్మద్ అంశాలు కీలకంగా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఏడుగురు ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారంటూ మంత్రి లోకేశ్ అన్నారు. కొందరు ఎమ్మెల్యేల తీరు ప్రభుత్వానికి, పార్టీకి నష్టం కలిగించేలా ఉంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు లోకేశ్. పెరోల్ లాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని హోంమంత్రి అనితకు లోకేశ్ సూచించారు.

చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం కరెక్ట్ కాదు..

ఇక, రాష్ట్రంలో వైసీపీ క్రిమినల్ మాఫియాను ధీటుగా ఎదుర్కొందామని మంత్రులతో లోకేశ్ అన్నారు. తొలుత ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి మీద విష ప్రచారం చేసిన వాళ్లు ఇప్పుడు మంత్రుల స్థాయిని దాటి, ఇప్పుడు ఎమ్మెల్యేల మీద కుట్రల పన్నుతున్నారని లోకేశ్ ధ్వజమెత్తారు.

తప్పు ఎవరిదైనా శ్రీశైలం ఎమ్మెల్యే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం సరికాదన్నారు లోకేశ్.

ఎమ్మెల్యేల తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు..

ప్రజల్లో ప్రభుత్వంపై సానుకూలత ఉన్న సమయంలో కొందరు ఎమ్మెల్యేల తీరు చెడ్డ పేరు తెస్తోందని సీరియస్ అయ్యారు. దగ్గుబాటి ప్రసాద్(అనంతపురం), బుడ్డా రాజశేఖర్ రెడ్డి(శ్రీశైలం), కొలికిపూడి శ్రీనివాసరావు(తిరువూరు), నజీర్ అహ్మద్(గుంటూరు ఈస్ట్), కూన రవికుమార్(ఆముదాలవలస) ల పేర్లను మంత్రుల దగ్గర ప్రస్తావించారు లోకేశ్. (Nara Lokesh)

ప్రతి ఇంఛార్జ్ మంత్రి తన పరిధిలో ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయకపోతే ఎలా అని లోకేశ్ ప్రశ్నించినట్లు సమాచారం.

మంత్రి వర్గ సమావేశంలో కొంత కీలక చర్చ జరిగింది. అజెండా సమావేశం జరిగిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని రాజకీయ అంశాల గురించి ప్రస్తావించారు.

కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి తలనొప్పిగా ఉందని చంద్రబాబు ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

క్యాబినెట్ సమావేశానికి ముందు మంత్రి లోకేశ్ తో మంత్రులు లంచ్ మీటింగ్ లో పాల్గొన్నారు. అక్కడ కొంత కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

8మంది ఎమ్మెల్యేల వ్యవహారశైలిపై చర్చించారు. అందరూ క్రమశిక్షణగా ఉండాలన్నారు.

ఎమ్మెల్యేల వ్యవహారశైలితో ముఖ్యమంత్రి చంద్రబాబుకి కొంత ఇబ్బంది కలుగుతోంది. ముఖ్యంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే, ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవి, తిరువూరు ఎమ్మెల్యే, గూడురు ఎమ్మెల్యే సూనీల్ అంశాలు చర్చకు వంశాయి. (Nara Lokesh)

లేడీ డాన్ అరుణ అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యే సునీల్ లెటర్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఇకపై ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని ముఖ్యంత్రి చంద్రబాబు చెప్పినట్లు లోకేశ్ అన్నారు.

Also Read: “అందుకే ఇప్పుడు మరో నాటకం మొదలుపెట్టారు”.. సౌమ్య ఆరోపణలపై క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే కూన రవి