AP Cabinet Decisions: రూ.904 కోట్లతో.. రాజధాని గ్రామాల్లో అభివృద్ధి పనులు.. ఇంకా.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

అత్యంత దారుణ హత్యకు గురైన పేరిక సామాజిక వర్గానికి చెందిన తోట చంద్రయ్య కుమారుడు తోట వీరాంజనేయులుకు జూనియర్..(AP Cabinet Decisions)

AP Cabinet Decisions: రూ.904 కోట్లతో.. రాజధాని గ్రామాల్లో అభివృద్ధి పనులు.. ఇంకా.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

Updated On : August 21, 2025 / 6:02 PM IST

AP Cabinet Decisions: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 3 గంటల పాటు సాగిన సమావేశంలో 33 అజెండా అంశాలకు ఆమోదం తెలిపింది. సీఆర్డీఏ ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. రాజధాని ల్యాండ్ పూలింగ్ స్కీమ్ గ్రామాల్లో అభివృద్ధి పనులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధాని గ్రామాల్లో రూ.904 కోట్లతో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులకు మంత్రిమండలి ఓకే చెప్పింది.

ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు..

* పర్యాటక ప్రాజెక్టులకు భూముల కేటాయింపు మార్గదర్శకాలకు ఆమోదం
* అధికారిక భాష కమిషన్ పేరు మార్పునకు క్యాబినెట్ ఆమోదం. మండలి వెంకట కృష్ణారావు అధికారిక భాష కమిషన్ గా మార్పు
* వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాల కోసం మార్పు చేసే నాలా చట్టం రద్దుకు ఆమోదం
* భూ మార్పిడి ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆ ప్రాంత అభివృద్ధికి వినియోగించాలి
* గుంటూరులోని మున్సిపల్ భూమిని టీడీపీ పార్టీ కార్యాలయానికి 33 సంవత్సరాలు లీజుకు ఇవ్వడానికి, ఎకరానికి 1000 రూపాయల చొప్పున దీన్ని
99 సంవత్సరాలు పాటు పొడిగించుకునే వెసులుబాటు కల్పిస్తూ మంత్రి మండలి ఆమోదం
* 44 ప్యాకేజీ ప్రకారం అమరావతిలో పనులను L1 బిడ్డర్లకు ఇవ్వటం కోసం ఆమోదం (AP Cabinet Decisions)

* అమరావతి రాజధాని చుట్టూ ఉన్న 25 గ్రామాల పరిధిలో రాజధానితో సమానంగా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం ఆమోదం
* SRM 11 వేల మంది విద్యార్థులు, VIT 17 వేల మంది విద్యార్థులు ఉన్న కళాశాలకు అదనంగా భూమి కేటాయిస్తూ 100 కోట్లు ఎకరా 2కోట్లకు
కేటాయింపు
* గత ప్రభుత్వ హయాంలో ధరలు పెంచి నాణ్యత తగ్గించి ప్రజల ప్రాణాలతో నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారు
* తాజాగా కూటమి ప్రభుత్వం హయాంలో రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో నాణ్యతపై ప్రత్యేక కమిటీ
* 4 రాష్ట్రాల్లో పర్యటించి కమిటీ అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి ఇచ్చిన నివేదికకు మంత్రి మండలి ఆమోదం
* చింతూరులోని 50 బెడ్లుగా ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను 100 పడకల ఏరియా ఆసుపత్రికి ఆమోదం
* టెన్నిస్ ప్లేయర్, అర్జున అవార్డ్ గ్రహీత సాకేత్ సాయికి గ్రూప్ వన్ అధికారిగా డిప్యూటీ కలెక్టర్ గా ఉద్యోగం (AP Cabinet Decisions)

* అత్యంత దారుణ హత్యకు గురైన పేరిక సామాజిక వర్గానికి చెందిన తోట చంద్రయ్య కుమారుడు తోట వీరాంజనేయులుకు జూనియర్ అసిస్టెంట్ గా
ఉద్యోగం కల్పిస్తూ ఆమోదం
* నాలా చట్టాన్ని రద్దు చేస్తూ మంత్రి మండలి ఆమోదం
* నెల్లూరు జిల్లా దగదర్తి, చిత్తూరు జిల్లా కుప్పంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి ఆమోదం
* చిత్తూరు జిల్లాలో నారా వారి పల్లెలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం
* ఎన్నికల వాగ్దానంలో అంగన్ వాడీ వర్కర్లకు లక్ష రూపాయలు, హెల్పర్లకు 40 వేల గ్రాట్యుటీకి ఆమోదం. (AP Cabinet Decisions)

Also Read: ఆ ఏడుగురు ఎమ్మెల్యేలపై లోకేశ్ సీరియస్.. పార్టీ, ప్రభుత్వానికి నష్టం అంటూ ఫైర్