Home » ap cabinet decisions
నూతన బార్ పాలసీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 7వేల 500 కోట్ల రుణం తీసుకునేందుకు ఏపీఐఐసీకి అనుమతి ఇచ్చారు.
సుమారు 4 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.
ఎయిర్ పోర్టులను లీజుకు ఇవ్వడం ద్వారా, పీపీపీ ద్వారా వచ్చిన ఆదాయం ద్వారా అప్పులు చెల్లించాలని నిర్ణయం.
సీబీఐ, జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, స్పోర్ట్స్ అకాడమీ వంటి వాటికి భూములు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం.
ఏడాదిలోగా అన్ని రెవెన్యూ సమస్యలు పరీష్కరించాలని మరోసారి తేల్చి చెప్పారు సీఎం చంద్రబాబు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఇబ్బందులు ఉంటే ఎన్నిసార్లైనా నాతో మాట్లాడొచ్చని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఒక్కోటి చొప్పున ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటునకు మంత్రి వర్గం ఆమోదం..
2500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్, 2500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ హబ్ నిర్మాణంపై డిస్కస్ చేశారు.
సీఆర్డీఏ ఆమోదించిన రూ.37,072 కోట్ల పనులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
అందరికీ ఇళ్లు పథకం కింద పట్టాలు ఇచ్చేందుకు విధివిధానాల జారీకి ఆమోదం.
ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారధి మీడియాకు వివరించారు.