AP Cabinet Decisions: ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.15వేలు.. ఆ సంస్థలకు భూములు.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

అమరావతిలో వివిధ పనుల వేగవంతానికి ఎస్‌పీవీ ఏర్పాటుకు ఆమోదం. కార్మిక చట్టాల్లో పలు సవరణల ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోద ముద్ర.

AP Cabinet Decisions: ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.15వేలు.. ఆ సంస్థలకు భూములు.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

Updated On : October 3, 2025 / 7:20 PM IST

AP Cabinet Decisions: ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసింది. రెండున్నర గంటల పాటు భేటీ జరిగింది. 20 అంశాలపై చర్చించి ఆమోదం తెలిపింది మంత్రివర్గం. రాష్ట్రంలోని ఆటో, క్యాబ్‌ డ్రైవర్లకు రూ.15 వేలు ఇచ్చే ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పలు సంస్థలకు భూములు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు..

* ల్యాండ్‌ ఇన్సెంటివ్‌ ఫర్‌ టెక్నికల్‌ హబ్స్‌ 2024-29కి ఆమోదం.
* జల వనరుల శాఖకు సంబంధించి వివిధ పనులకు ఆమోదం.
* ఆటో, క్యాబ్‌ డ్రైవర్లకు రూ.15 వేలు ఇచ్చే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం.
* కారవాన్‌ టూరిజం పాలసీకి ఆమోదం.
* అమృత్‌ 2.0 పథకం పనులకు సంబంధించి ఆమోదం.
* అమరావతిలో వివిధ పనుల వేగవంతానికి ఎస్ వీయు ఏర్పాటుకు ఆమోదం.
* రాష్ట్రవ్యాప్తంగా పలు సంస్థలకు భూకేటాయింపులకు ఆమోదం.
* కుష్టు వ్యాధి పదం తొలగించే చట్ట సవరణ ప్రతిపాదనకు ఆమోదం.
* విద్యుత్‌ శాఖకు సంబంధించి పలు పనులకు ఆమోదం.
* హోం స్టే ల పాలసీకి క్యాబినెట్ ఆమోదం.
* కార్మిక చట్టాల్లో పలు సవరణల ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోద ముద్ర.

* గతంలో పలు కారణాలతో ల్యాండ్ పూలింగ్ పెండింగ్ లో ఉన్న 300 ఎకరాల భూసేకరణ చేయాలని క్యాబినెట్ నిర్ణయం.
* కుష్టు వ్యాధితో బాధపడుతున్నారు అనే పదాన్ని తొలగించాలని క్యాబినెట్ నిర్ణయం.
* అసైన్ ల్యాండ్లను గ్రీన్ ఎనర్జీకి లీజ్‌ ఇచ్చుకొనేందుకు మంత్రి మండలి ఆమోద ముద్ర.

Also Read: ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎప్పటి నుంచి ప్రారంభం.. ఏ ఎగ్జామ్ ఎప్పుడు అంటే..