AP Cabinet Decisions: లక్ష 17వేల కోట్ల పెట్టుబడులు.. పర్యాటక ప్రాంతాల్లో స్టార్ హోటళ్లు.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు
ప్రకాశం జిల్లాలో దొనకొండ వద్ద బీడీఎల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు 317 ఎకరాలు ఇచ్చేందుకు మంత్రివర్గం ఓకే చెప్పింది.

AP Cabinet Decisions: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ఎస్ఐపిబిలో తీసుకున్న నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. విజయనగరంలో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కు తోటపల్లి బ్యారేజ్ నుంచి నీటి విడుదలకు క్యాబినెట్ అమోదం తెలిపింది. కర్నూలులో రిలయన్స్ కంజూమర్స్ ప్రాజెక్ట్ కు 120 ఎకరాలు అచ్చేందుకు ఆమోద ముద్ర వేసింది.
టూరిజం పాలసీ కోసం ల్యాండ్ పాలసీలో భాగంగా దస్ పల్లా అమరావతి ప్రాజెక్ట్ కు ఆమోదం తెలిపింది. ట్రైబల్ ఏరియాలో 50శాతం వారికి భాగస్వామ్యం ఇచ్చి వారి ల్యాండ్ ను టూరిజం కోసం అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారని మంత్రి పార్థసారధి తెలిపారు.
ప్రకాశం జిల్లాలో దొనకొండ వద్ద బీడీఎల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు 317 ఎకరాలు ఇచ్చేందుకు మంత్రివర్గం ఓకే చెప్పింది. మిగతా అవసరమైన భూమి రైతుల వద్ద నుండి సేకరణ చేసేందుకు ఆమోదం తెలిపింది. పంచాయతీ సెక్రటరీలను పంచాయతీ డెవలప్ మెంట్ ఆఫీసర్లుగా పేరు మారుస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
Also Read: కూటమిని ఇరుకున పెట్టాలనుకున్న జగన్ అస్త్రం.. వైసీపీ మెడకే చుట్టుకుంటుందా?
క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
* SIPB ఆమోదించిన లక్ష 17వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం
* పర్యాటక ప్రాంతాల్లో స్టార్ హోటల్స్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
* అమరావతిలో రూ.200 కోట్లతో దసపల్లా 4స్టార్ హోటల్
* అమరావతిలో సదరన్ గ్రూప్ స్టార్ హోటల్ నిర్మాణానికి ఆమోదం
* కొత్తవలసలో మైరా రిసార్ట్స్ హోటల్ నిర్మాణానికి ఆమోదం
* అనంతపురంలో 400 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్ కు ఆమోదం
* విజయనగరంలో చింతా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ కు ఆమోదం
* కర్నూలు జిల్లా ఓర్వకల్లులో రిలయన్స్ ఎఫ్ఎంసీజీ రూ.5వేల కోట్ల పెట్టుబడులు
* విశాఖలో రూ.4వేల 800 కోట్లతో రైడన్ ఇన్ఫోటెక్ సంస్థ ఏర్పాటుకు ఆమోదం
* శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని క్యాబినెట్ ఆమోదం
* శ్రీశైలం పుణ్యక్షేత్రంలో స్టార్ హోటల్ నిర్మాణానికి ఆమోదం