కాంగ్రెస్ కొత్త బాస్ ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

పీసీసీ చీఫ్ రేసులో ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, మధుయాష్కి గౌడ్ ఉన్నారు.

New TPCC Chief : తెలంగాణ కొత్త పీపీసీ నియామకంపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఇవాళ్టితో(జూన్ 27) పీసీసీ చీఫ్ గా రేవంత్ పదవీ కాలం ముగుస్తుంది. దీంతో కొత్త చీఫ్ ఎంపికపై హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా బీసీ సామాజికవర్గానికి చెందిన నేతకు పీసీసీ పదవి ఇచ్చే అవకాశం ఉంది. పీసీసీ చీఫ్ రేసులో ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, మధుయాష్కి గౌడ్ ఉన్నారు. ఇవాళ రాత్రికి కాంగ్రెస్ హైకమాండ్ తో భేటీ కానున్న సీఎం రేవంత్.. కొత్త పీసీసీ ఎంపిక, క్యాబినెట్ విస్తరణపై చర్చించనున్నారు. పీసీపీ ఎంపిక పూర్తిగా హైకమాండ్ నిర్ణయమేనని సీఎం రేవంత్ తెలిపారు. పీసీసీగా తాను ఎవరి పేరును సూచించబోను అని వెల్లడించారు.

తెలంగాణ కాంగ్రెస్ నూతన పీసీసీ నియామకంపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి పెట్టింది. రేవంత్ రెడ్డి జూలై 7 2021న పీసీసీగా బాధ్యతలు తీసుకున్నారు. మూడేళ్ల పాటు పదవీకాలంలో ఉన్నారు. ఆయనకు ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో, పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో నేను పూర్తిగా సంతృప్తిగా ఉన్నానని, ఇక కొత్త పీసీసీని నియమించాలని నేను అధినాయకత్వానికి సూచించానని, పీసీసీ నియామక ప్రక్రియ అధిష్టానం తీసుకుంటుందని, పీసీసీగా ఎవరు ఉండాలి? అనేది పేరు కూడా తాను సూచించబోను అని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.

Also Read : నాది జగన్ తరహా పాలన కాదు: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్

ట్రెండింగ్ వార్తలు