Pawan Kalyan : కాపు-బీసీ కలిస్తే మనదే అధికారం, సగం పదవులు బీసీలకే- పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

కాపు-బీసీ కాంబినేషన్ ఉండాలన్నారు పవన్ జనసేన అధినేత. కాపు-బీసీ కలిస్తే రాజ్యాధికారం సాధ్యం అన్న పవన్.. ఈ కాంబినేషన్ ఉంటే ఎవరినీ దేహీ అని అడగాల్సిన అవసరం లేదన్నారు. మంగళగిరిలో జనసేన పార్టీ బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో పవన్ కల్యాణ్ ఈ కీలక కామెంట్స్ చేశారు.

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త ఈక్వేషన్ ను తెరమీదకు తెచ్చారు. కాపు-బీసీ కాంబినేషన్ ఉండాలన్నారు పవన్ జనసేన అధినేత. కాపు-బీసీ కలిస్తే రాజ్యాధికారం సాధ్యం అన్న పవన్.. ఈ కాంబినేషన్ ఉంటే ఎవరినీ దేహీ అని అడగాల్సిన అవసరం లేదన్నారు. మంగళగిరిలో జనసేన పార్టీ బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో పవన్ కల్యాణ్ ఈ కీలక కామెంట్స్ చేశారు.

కాపు-బీసీ కలిస్తే రాజ్యాధికారం సాధ్యం..
” నేను కాపు నాయకుడిని కాదు. నేను కుల ఫీలింగ్ తో పెరగలేదు. మానవత్వంతో పెరిగాను. కాపు రిజర్వేషన్లపై కొందరు బీసీ నేతలు తమ అభిప్రాయాన్ని చెప్పారు. రేపు కాపు ప్రతినిధులతో జరిపే సమావేశంలో చర్చిస్తాను. కాపు-బీసీ కలిస్తే రాజ్యాధికారం సాధ్యం. ఈ కాంబినేషన్ ఉంటే ఎవరినీ దేహీ అని అడగాల్సిన అవసరం లేదు. రోజుకు అర్ధ రూపాయి తీసుకుని ఓటు అమ్ముకునే దుస్థితి పోతే. పరిస్థితుల్లో మార్పు వస్తుంది. బీసీలకు సంబంధించి అందరి అభిప్రాయాలు తీసుకున్నాం.

Also Read..Machilipatnam Lok Sabha Constituency : రసవత్తరంగా బందరు పాలిటిక్స్…మచిలీపట్నం చుట్టూ తిరుగుతున్న రాష్ట్ర రాజకీయాలు !

బీసీ నేతను నిలబెడితే ఎందుకు ఓట్లేయరు..?
బీసీలంటేనే ఉత్పత్తి కులాలు. ఉత్పత్తి లేకుంటే సమాజమే లేదు. బీసీలంటే బ్యాక్ వార్డ్ క్లాస్ కాదు. బ్యాక్ బోన్ క్లాస్. బీసీలకు ఇన్ని ఇచ్చాం.. ఇన్ని పదవులిచ్చాం అని పార్టీలు చెప్పుకుంటున్నాయి. బీసీ కులాలకు సంఖ్యా బలం ఉన్నా దేహీ అనే పరిస్థితి ఎందుకు వచ్చింది..? బీసీల అనైక్యతే మిగిలిన వారికి బలం. బీసీలు ముందుగా సాధించాల్సింది ఐక్యత. పూలేను గౌరవించింది మనమే. బీసీ సదస్సు అంటే ఇంతమంది వచ్చారు. కానీ బీసీ నేతను నిలబెడితే ఎందుకు ఓట్లేయరు..? గత ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ సీపీఐ అడిగినా బీసీ నేత అయిన పోతిన మహేష్ కోసం వారికి ఇవ్వలేదు. నేను బీసీల కోసం నిలబడతాను” అని పవన్ కల్యాణ్ అన్నారు.

Also Read..Anantapur Lok Sabha constituency: పవన్ కల్యాణ్‌ను పోటికి దించుతారా.. కొత్త ముఖాలేమైనా బరిలోకి దిగబోతున్నాయా?

బొత్స పెరిగితే తూర్పు కాపులు పెరిగినట్టు కాదు..
”నేను మాట్లాడితే నన్ను ఎస్సీ, బీసీ, కాపులతో తిట్టిస్తారు. రాజ్యాధికారం అనుభవించిన కులాలతో విమర్శలు చేయించరు. తెలంగాణలో కొన్ని కులాలను బీసీ జాబితా నుంచి తప్పించారు. దీనిపై ఏపీ నుంచి ఎవ్వరూ మాట్లాడలేదు. ఏ బీసీ మంత్రి, ఏ బీసీ ఎమ్మెల్యే కూడా మాట్లాడలేదు. ఉత్తరాంధ్రకు చెందిన బీసీ కులాలను తెలంగాణ ప్రభుత్వం బీసీ జాబితా నుంచి తప్పిస్తే ధర్మాన, బొత్స లాంటి వాళ్లు ఎందుకు మాట్లాడరు..? బొత్స పెరిగితే తూర్పు కాపులు పెరిగినట్టు కాదు.

టీటీడీ బోర్డులో సగం పదవులు బీసీలకే..
ఏపీ బీఆర్ఎస్ నేతలు దీనిపై స్పందించాలి.. సమాధానం చెప్పాలి. తెలంగాణలో 26 కులాలను బీసీ జాబితా నుంచి తప్పించారు.. దీనిపై బీఆర్ఎస్ వివరణ ఇవ్వాలి. సంఖ్యా బలం లేని ఎంబీసీల కోసం నేనేం చేయగలనో ఆలోచిస్తున్నా. రూ.32వేల కోట్ల బీసీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు. 56 బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కారు స్టిక్కర్లకే పరిమితం చేశారు. మేం అధికారంలోకి వస్తే టీటీడీ బోర్డులో సగం పదవులు బీసీలకే ఇస్తాం” అని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.

Also Read..Hindupur Lok Sabha Constituency: పరిటాల ఫ్యామిలీ ఫామ్‌లోకి వస్తుందా.. వైసీపీ పట్టు నిలుపుకోగలదా?

” బీసీ యువత.. భవిష్యత్ కోసం యాక్షన్ ప్లాన్ రూపొందించాలి. నేను అన్ని కులాలను సమానంగా గౌరవిస్తా. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే సరి చేసే ప్రయత్నం చేశాను. కోనసీమలో కాపులు, శెట్టిబలిజ కులాలను కలిపే ప్రయత్నం చేశాను. బలమైన కులాలు ఎందుకు కొట్టుకోవాలి. కోనసీమలో ఇప్పుడు బలమైన మార్పు చూస్తున్నాం. గోదావరి జిల్లాల్లో నాకు ఎక్కువగా బీసీ ఓట్లే పడ్డాయి. మత్స్యకారులు చాలామంది ఓట్లేశారు. నన్ను కాపు ప్రతినిధిగా చూడనవసరం లేదు. ఆర్థిక పరిపుష్టి వస్తే.. రాజ్యాధికారం కచ్చితంగా వస్తుంది. వైసీపీ, టీడీపీలకు ఆర్థిక పరిపుష్టే బలం” అని పవన్ కల్యాణ్ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు