Krishna Sai : పేద విద్యార్థినికి సాయం చేసిన హీరో..

సుందరాంగుడు సినిమాతో హీరోగా పరిచయమైన కృష్ణ సాయి కొన్నాళ్ల క్రితం కృష్ణ సాయి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.

Actor Krishna Sai Financial Helping to Poor Student

Krishna Sai : పలువురు సినీ సెలబ్రిటీలు రియల్ లైఫ్ లోను సేవా కార్యక్రమాలు చేస్తుంటారని తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నుంచి చిన్న హీరోల వరకు మానవత్వంతో ఏదో ఒక సమయంలో సహాయం చేసినవారే. తాజాగా నటుడు, హీరో కృష్ణసాయి ఓ పేద విద్యార్థినికి సాయం చేశాడు. సుందరాంగుడు సినిమాతో హీరోగా పరిచయమైన కృష్ణ సాయి ప్రస్తుతం ‘జ్యువెల్‌ థీఫ్‌’ అనే సినిమా చేస్తున్నారు.

కృష్ణసాయి కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సేవ చేయడానికి కొన్నాళ్ల క్రితం కృష్ణ సాయి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా పేద కుటుంబానికి చెందిన‌ డిగ్రీ విద్యార్థిని జి.లావ్యకు ఆర్థిక సాయం చేశారు. మే 1న‌ కృష్ణసాయి పుట్టినరోజు సందర్భంగా కృష్ణసాయి ఛారిటబుల్ ట్రస్ట్ తరపున సూపర్ స్టార్ కృష్ణ మేకప్ మ్యాన్ మాధవరావు చేతుల మీదుగా ఆ విద్యార్థినికి రూ.15 వేలు చెక్కు అందించారు.

Also Read : Jithender Reddy Trailer : ఎన్నికల ముందు సంచలన బయోపిక్.. ‘జితేందర్ రెడ్డి’ ట్రైలర్ రిలీజ్.. సీనియర్ ఎన్టీఆర్ పాత్ర కూడా..

ఈ సందర్భంగా కృష్ణసాయి మాట్లాడుతూ.. పేద‌రికంతో చ‌దువులు ఆగిపోకూడదు. మ‌ట్టిలో మాణిక్యాలకు చేయుత ఇవ్వాలి. చ‌దువుల త‌ల్లి లావ్యకు నా స‌పోర్టు ఉంటుంది. నా సేవలు మున్ముందు కూడా సాగుతాయి అని తెలిపారు. తమకు ఆర్థిక సాయం చేసిన కృష్ణసాయికి విద్యార్థిని జి.లావ్య కుటుంబం కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.