Varanasi: ‘వారణాసి’ ఓవర్సీస్ హక్కుల కోసం భారీ డీల్.. సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న జక్కన్న-మహేష్ బాబు మూవీ.
రాజమౌళి- మహేష్ బాబు వారణాసి(Varanasi) సినిమాకు ఓవర్సీస్ లో భారీ డిమాండ్ ఏర్పడింది.
Rs. 160 crore offer for overseas theatrical rights of Varanasi movie
- వారణాసి సినిమాకు ఓవర్సీస్ లో భారీ డిమాండ్
- రూ.160 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చిన ప్రముఖ సంస్థ
- వారణాసి మూవీ సరికొత్త రికార్డ్స్
Varanasi: టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘వారణాసి’. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. యాక్షన్ అండ్ అడ్వెంచరర్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టైటిల్ వీడియోకి ప్రపంచవ్యాప్తంగా భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ వీడియో తరువాత సినిమా క్రేజ్ ఆకాశాన్ని తాకుతోంది. తాజాగా ఈ చిత్రం ఓవర్సీస్ థియేట్రికల్ హక్కుల విషయంలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోందని ట్రేడ్ వర్గాల సమాచారం.
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, ప్రముఖ విదేశీ పంపిణీ సంస్థ ‘ఫార్స్ ఫిలింస్’ వారణాసి(Varanasi) సినిమా ఓవర్సీస్ హక్కుల కోసం ఏకంగా రూ. 160 కోట్ల భారీ ఆఫర్ను మేకర్స్ ముందు పెట్టిందట. ఒక ఇండియన్ సినిమాకు కేవలం విదేశీ హక్కుల కోసమే ఈ స్థాయిలో ధర పలకడం ఇదే మొదటిసారి. గతంలో రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ సృష్టించిన రికార్డులను కూడా ఈ ‘వారణాసి’ బ్రేక్ చేసేందుకు సిద్ధంగా ఉంది.
Manasa Varanasi: అందాల రాక్షసి మానస వారణాసి.. క్రేజీ ఫొటోలు వైరల్
అయితే, వారణాసి సినిమాకు ఈ రేంజ్ లో క్రేజ్ రావడానికి ప్రధాన కారణం అంటే రాజమౌళి అనే చెప్పాలి. ‘RRR’ మూవీ తరువాత ఆయనకు గ్లోబల్ స్థాయిలో ఒక రేంజ్ క్రేజ్ ఏర్పడింది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం సరికొత్త మేకోవర్ తో కనిపిస్తుండటం ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక బడ్జెట్ కూడా రూ.1,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు మేకర్స్. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి అంతర్జాతీయ గుర్తింపు ఉన్న నటీనటులు ఉండటం కూడా ఓవర్సీస్ బయ్యర్లను ఆకర్షిస్తోంది. అందుకే ఈ సినిమాపై స్పెషల్ క్రేజ్ ఏర్పడింది.
ఒకవేళ వారణాసి సినిమా ఓవర్సీస్ రైట్స్ డీల్ రూ.160 కోట్లకు కుదిరితే, వారణాసి సినిమా విదేశీ మార్కెట్లో లాభాల్లోకి రావాలంటే సుమారు రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది. రాజమౌళి బ్రాండ్ వాల్యూ చూస్తుంటే, ఇది అసాధ్యమేమీ కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఈ డీల్ పై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక వారణాసి సినిమా 2027 ఏప్రిల్ 7న 120 దేశాల్లో గ్రాండ్గా విడుదల కానుంది. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి.
