CM Jagna : ఎన్నికల ప్రచారంలో గేరు మార్చనున్న సీఎం జగన్.. ఇకనుంచి రోజుకు నాలుగు బహిరంగ సభలు!

కేవలం పది రోజులు మాత్రమే ఎన్నికల ప్రచారానికి సమయం ఉండటంతో జగన్ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేయనున్నారు.

CM Jagan Election Campaign : ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరింది. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో పార్టీల అధినేతలు, అభ్యర్థులు ప్రచారంలో దూకుడును మరింత పెంచారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే బస్సు యాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించగా.. కొద్దిరోజులుగా రోజుకు మూడు నియోజకవర్గాల్లో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించారు. తాజాగా సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో గేరు మార్చనున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ప్రచారంపై సమీక్ష నిర్వహించిన జగన్.. ప్రచారంలో మరింత స్పీడ్ పెంచేందుకు రెడీ అవుతున్నారు. జగన్ సుడిగాలి పర్యటనపై సాయంత్రంలోగా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది.

Also Read : PM Modi : ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల‌ ప్రచారం.. సభలు, రోడ్ షోలలో పాల్గోనున్న ప్రధాని

గురువారం ప్రచారానికి బ్రేక్ ఇచ్చిన జగన్.. రేపటి నుంచి రోజుకు నాలుగు బహిరంగ సభల్లో పాల్గొంటూ సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఈనెల 13న పోలింగ్ జరగనుండగా.. 11వ తేదీ సాయంత్రం వరకు ప్రచారానికి తెరపడనుంది. దీంతో 11వ తేదీ వరకు ప్రచార సభలు ఉండేలా వైసీపీ అధిష్టానం ప్లాన్ చేస్తుంది. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో వీలైనన్ని నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేసేలా జగన్ ప్రచార రూట్ మ్యాప్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు రోజుకు మూడు సభలు చొప్పున 12 నియోజకవర్గాల్లో జగన్ ప్రచారం సాగింది. జగన్ జైత్రయత్రకు జనం నుంచి అనూహ్య స్పందన లభించింది. జగన్ సైతం ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాలపై తనదైనశైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజలకు ఏం చేశారో చెప్పాలని విపక్షాలను జగన్ సూటిగా ప్రశ్నిస్తున్నారు. అంతేకాక.. తన హయాంలో చేసిన అభివృద్ధిని జగన్ ప్రజలకు వివరిస్తున్నారు.

Also Read : CM Jagan Bus Yatra: మండుటెండల్లోనూ జగన్ సభలకు పోటెత్తుతున్న జనం

కేవలం పది రోజులు మాత్రమే ఎన్నికల ప్రచారానికి సమయం ఉండటంతో జగన్ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. ఈ పదిరోజుల్లో జరిగే ప్రచారంలో గడిచిన ఐదేళ్లలో ఏం చేశాం.. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే ఏఏ పథకాలు అమలు చేయబోతున్నాం.. ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నాం అనే విషయాలను ప్రజలకు జగన్ వివరించనున్నారు. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలపైన తనదైనశైలిలో విమర్శలు గుప్పించేందుకు జగన్ సిద్ధమయ్యారు. మొత్తానికి రాబోయే పది రోజుల కాలంలో జగన్ మోహన్ రెడ్డి తన ప్రచారంలో గేరుమార్చి మరింత స్పీడ్ పెంచనున్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు