PM Modi : ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల‌ ప్రచారం.. సభలు, రోడ్ షోలలో పాల్గోనున్న ప్రధాని

ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారైంది. ఎన్నికల ప్రచార సభలు, రోడ్ షోలలో మోదీ పాల్గోనున్నారు.

PM Modi : ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల‌ ప్రచారం.. సభలు, రోడ్ షోలలో పాల్గోనున్న ప్రధాని

PM Modi (Photo Credit : Facebook)

PM Modi Election Campain in AP : ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారైంది. ఎన్నికల ప్రచార సభలు, రోడ్ షోలలో మోదీ పాల్గోనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి కూటమిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు కూటమి అభ్యర్థుల విజయం కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వీరికితోడు ప్రధాని నరేంద్ర మోదీ కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించే సభలు, రోడ్ షోలలో పాల్గోనున్నారు.

Also Read : CM Jagan Craze : మళ్లీ జగనే సీఎం..! ఇదిగో నిదర్శనం..! మండుటెండల్లోనూ జగన్ సభలకు పోటెత్తుతున్న జనం

ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 7, 8 తేదీల్లో రోడ్ షోలు, సభల్లో పాల్గోనున్నారు. రాజమహేంద్రవరంలో కూటమి ఎంపీ అభ్యర్థి పురందేశ్వరికి మద్దతుగా 7వ తేదీ సాయంత్రం 3.30 గంటలకు వేమగిరిలో తలపెట్టిన సభలో మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 5.45 గంటలకు అనకాపల్లి పరిధిలోని రాజుపాలెం సభలో మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. 8వ తేదీ సాయంత్రం 4గంటలకు పీలేరు సభలో మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. అదేరోజు రాత్రి 7గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు రోడ్ షోలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గోనున్నారు.

Also Read : Tdp Janasena Manifesto : మీ హామీలన్నీ మా పథకాలే- కూటమి మ్యానిఫెస్టోపై వైసీపీ తీవ్ర ఆరోపణలు

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు, తెలంగాణలో పార్లమెంట్ నియోజకవర్గాలకు మే13న పోలింగ్ జరగనుంది. ఇరు రాష్ట్రాల్లో బీజేపీ అభ్యర్థుల విజయంకోసం బీజేపీ జాతీయ అగ్రనాయకత్వం ప్రచార రంగంలోకి దిగింది. తెలంగాణలో 8, 10 తేదీల్లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్నారు. 8న వేములవాడ, వరంగల్ సభల్లో పాల్గోనున్న ప్రధాని.. 10న మహబూబ్ నగర్ తో పాటు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించే భారీ బహిరంగ సభల్లో ప్రధాని పాల్గోనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.

మరోవైపు లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి బీజేపీ తరపున ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్నారు. మే 13న మోదీ నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది.