YS Viveka Case : వివేకా హత్య కేసు.. సీబీఐ ఛార్జ్ షీట్ లో కీలక అంశాలు

వివేకా హత్య కేసుపై దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొంది. పీఏ కృష్ణారెడ్డిపై అనుమానాలు ఉన్నాయని, ఆధారాలు లభించలేదని అలాగే ఆధారాలు చెరిపివేత సమయంలో మనోహర్ రెడ్డి ఉన్నప్పటికీ అతని ప్రమేయం నిర్ధారణ కాలేదని తెలిపింది.

YS Viveka Case (1)

CBI Charge Sheet : మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు చేసిన సీబీఐ.. ఛార్జ్ షీట్ లో కీలక అంశాలు చేర్చింది. వివేక హత్య కేసులో కీలక ఆధారాలు చెరిపేసినట్లు వివరించింది. ఫొటోలు, గూగుల్ టేకౌట్, లోకేషన్ డేటాను సీబీఐ కోర్టుకు సమర్పించింది. వివేకా హత్యకు వైఎస్ అవినాశ్, భాస్కర్ రెడ్డి కుట్ర చేశారని తెలిపింది.

వివేకా హత్య కేసుపై దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొంది. పీఏ కృష్ణారెడ్డిపై అనుమానాలు ఉన్నాయని, ఆధారాలు లభించలేదని అలాగే ఆధారాలు చెరిపివేత సమయంలో మనోహర్ రెడ్డి ఉన్నప్పటికీ అతని ప్రమేయం నిర్ధారణ కాలేదని తెలిపింది. వివేకా ఇంట్లో వైఫై రూటర్లకు కనెక్టు అయిన వారి వివరాలు సేకరిస్తున్నామని తెలిపింది.

Sridhar Reddy : మా పార్టీ వాళ్లే నాపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు : ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి

వైఫై రూటర్స్ వివరాల కోసం అమెరికా అధికారులను కోరామని తెలిపింది. వివేకా లేఖపై నిన్ హైడ్రేన్ పరీక్షలు నిర్వహించాలని, అలాగే ఫోరెన్సిక్ నివేదిక అందాల్సివుందని సీబీఐ ఛార్జ్ షీట్ లో పొందుపరిచింది.

ట్రెండింగ్ వార్తలు