Covid-19 : అనారోగ్యంతో మావోయిస్టు అగ్రనేతలు..లొంగిపోతే ప్రాణాలు కాపాడతామంటున్న పోలీసులు

కరోనా సోకి కోలుకున్నా తరువాత కూడా మావోయిస్టు అగ్రనేతలుపలు అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారు లొంగిపోతే ప్రాణాలు కాపాడతామంటున్నారు పోలీసులు...

Corona trouble for the Maoists : కరోనా అందరి జీవితాలను మార్చేసినట్లే కరడు కట్టిన మావోయిస్టులపై కూడా ప్రభావం చూపింది. కరోనాసోకి ఎంతోమంది మావోయిస్టులు ఇబ్బందులు పడ్డారు. మావోయిస్టుల అగ్రనేతలకు సైతం కరోనా సోకిన కష్టాలు తప్పలేదు.అందరిలా వారు నిర్భయంగా ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి కరోనా వ్యాక్సిన్లు వేయించుకునే పరిస్థితి లేదు. దీంతో కరోనా బారిన పడి నానా అవస్థలకు గురయ్యారు. ఏపీ తెలంగాణా రాస్ట్రాల్లో మావోయిస్టులు కొంతమంది సహకారంతో దాదాపు 700మంది వరకు వ్యాక్సిన్లు వేయించుకున్నారు. కానీ కరోనా బారిన పడి కోలుకున్న తరువాత కూడా వారికిపలు రకాల అనారోగ్యాలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ప్రాణాలు దక్కించుకోవటానికి పలువురు మావోలు పోలీసులకు లొంగిపోయిన పరిస్థితులు వచ్చాయి. అలా కొందరు లొంగిపోయారు కూడా.

Read more : Maoist Tested Positive: కరోనాతో 10 మంది మావోయిస్టులు మృతి

అలా మావోయిస్టు దంపతులు పొజ్జో, లఖ్కె దంతెవాడ పోలీసులకు లొంగిపోయారు. ఈ సందర్భంగా పొజ్జో దంపతులు పలు సంచలన విషయాలు వెల్లడించారు.మావోయిస్టు అగ్రనేతలు పలువురు అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిపారు. అలాగే, దాదాపు 700 మంది మావోయిస్టులు కరోనా టీకాలు వేయించుకున్నట్టు పేర్కొన్నారు. చత్తీస్‌గఢ్‌లో టీకాలపై అనుమానంతో ఏపీ, తెలంగాణ నుంచి టీకాలను తెప్పించుకున్నట్టు వివరించారు. టీకాలతోపాటు చికిత్సకు అవసరమైన మెడిసిన్స్ కూడా మావోయిస్టులకు చేరాయని తెలిపారు.

Read more : Maoist Ravi died : బాంబులు తయారుచేస్తుండగా..పేలి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మృతి

మావోయిస్టు దక్షిణ విభాగానికి చెందిన డాక్టర్లు చికిత్స అందిస్తున్నారని హిడ్మా, సుజాత, వికాస్, రఘుతోపాటు పలువురు మావోయిస్టు అగ్రనేతలు కొవిడ్ టీకాలు తీసుకున్నారని తెలిపారు. దక్షిణ బస్తర్ విభాగం ఇన్‌చార్జ్ రఘు, మాసా బెటాలియన్ కమాండర్ రాజేశ్ అనారోగ్యంతో బాధపడుతున్నారని..బహుశా వారికి కరోనా సోకి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు పొజ్జో దంపతులు. ఇమ్యూనిటీ కోల్పోయి..ఓపిక లేక నీరసించిపోయి కర్రల సాయంతో నడుస్తున్నారని..రోజులు గడిచే కొద్దీ వారి ఆరోగ్యం క్షీణిస్తోందని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో వారి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని అన్నారు.

Read more : Maoist RK Death : ఆర్కే చనిపోయాడు.. అంత్యక్రియలు అయిపోయాయి

రఘుపై రూ. 25 లక్షల రివార్డు ఉంది. అనారోగ్యంతో బాధపడుతున్న మావోలు లొంగిపోతే మెరుగైన చికిత్స అందిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. లొంగిపోయిన మావోయిస్టు దంపతులు పొజ్జో, లఖ్కె అసలు పేర్లు సంజు మాద్వి, తులసి మాద్వి. వీరిపై పలు కేసులు ఉన్నాయి. 70 మంది జవాన్ల హత్య కేసుతోపాటు భద్రతా దళాలపై జరిగిన 12 దాడుల్లో వీరి ప్రమేయం ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. గతంలో వీరిపై రూ. 5 లక్షల రివార్డు కూడా ప్రకటించారు.

 

ట్రెండింగ్ వార్తలు