AP MLA Quota MLC elections : ఏపీలో ఆసక్తికరంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తిని రేపుతున్నాయి. ఎమ్మెల్యే కోటాలో ఏడు ఎమ్మెల్సీ స్థానాకులకు ఎనిమిది మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇప్పటికే గెలుపు వ్యూహాలు రచిస్తున్న బాధ్యులకు ఎమ్మెల్సీ ఎన్నికలు టెన్షన్ పెడుతున్నాయి.

AP MLA Quota MLC elections : ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తిని రేపుతున్నాయి. ఎమ్మెల్యే కోటాలో ఏడు ఎమ్మెల్సీ స్థానాకులకు ఎనిమిది మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇప్పటికే గెలుపు వ్యూహాలు రచిస్తున్న బాధ్యులకు ఎమ్మెల్సీ ఎన్నికలు టెన్షన్ పెడుతున్నాయి. ఏపీలో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో ఏకగీగ్రవంగా గెలుస్తారని అంతా భావించారు. కానీ, టీడీపీ చివరి నిమిషంలో అనురాధతో నామినేషన్ వేయించింది. దీంతో వైసీపీ అలర్ట్ అయింది.

టీడీపీ గెలిచే అవకాశం లేకపోయినా అనురాధతో నామినేషన్ వేయించడం వెనుక ఇద్దరు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మద్దతుతోపాటు వైసీపీలో మరికొందరు అసంతృప్త ఎమ్మెల్యేలు ఉన్నారనే వాదన వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పోరు గెలిచేందుకు సీఎం జగన్ వ్యూహం సిద్ధం చేశారు. ఒక్క ఓటు కూడా వృధ కాకుండా జాగ్రత్తులు తీసుకుంటున్నారు.

AP MLC Election Results 2023 : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ క్లీన్‌స్వీప్.. పశ్చిమ రాయలసీమలోనూ విజయం

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రులకు సీఎం జగన్ బాధ్యతలు అప్పగించారు. ఒక్కో మంత్రికి ఏడుగురు ఎమ్మెల్యేలను అటాచ్ చేశారు. ఓటు వేసే వరకు ఆయా ఎమ్మెల్యేలను మంత్రులు సమన్వయం చేయనున్నారు. మరోవైపు టీడీపీ వైసీపీకి టెన్షన్ పెంచుతోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలందరికీ టీడీపీ విప్ జారీ చేసింది. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలుగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం నారాయణరెడ్డిపై టీడీపీ ఆశలు పెట్టుకుంది.

ట్రెండింగ్ వార్తలు