Pawan Kalyan : ముస్లింలతో సమావేశంలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

నేను బీజేపీలో ఉన్నానని ముస్లింలు నన్ను వదిలేస్తే మీరు నష్టపోతారు.నేను మతాన్ని, ఘర్షణలను అర్థం చేసుకుని వచ్చాను. సత్యమేదో..అసత్యమేదో న్యాయం చేసేవారు ఎవరో తెలుసుకోవాలి.

Pawan Kalyan

Pawan Kalyan In Kakinada : వారాహి వాహనంపై యాత్ర కొనసాగిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తున్నారు. పలు సామాజిక వర్గాల ప్రజలతోను..నేతలతోను సమావేశమవుతున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. దీంట్లో భాగంగా పవన్ కాకినాడలో ముస్లింలతో సమావేశమయ్యారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతు కీలక వ్యాఖ్యలు చేశారు. నేను బీజేపీతో పొత్తు పెట్టుకున్నానని నన్ను ముస్లింలు వదిలేస్తే ముస్లింలు నష్టపోతారని అన్నారు. జగన్ క్రిష్టియన్ కాబట్టి ఆయనను నమ్మవచ్చని ముస్లింలు అనుకుంటున్నారు..బీజేపీతో పొత్తు పెట్టుకునే ఏ పార్టీ కూడా ముస్లింలకు నచ్చదని..నిజంగా అల్లాను ప్రార్థిస్తే సత్యం చెప్పేవాడు మీకు తపపకుండా కనిపిస్తాడని అన్నారు.

నేను మతాన్ని, ఘర్షణలను అర్థం చేసుకుని వచ్చానని అన్నారు. సత్యమేదో..అసత్యమేదో న్యాయం చేసేవారు ఎవరో తెలుసుకోవాలని సూచించారు. మనకు అండగా నిలవని వాడు..న్యాయం చేయనివారు ముస్లిం నాయకుడు అయితే ఏంటి, హిందూ నాయకుడు అయితే ఏంటి? మరెవరు అయితే ఏంటీ ఎవరు న్యాయం చేస్తారు? అనేది మాత్రమే ఆలోచించుకోవాలని సూచించారు. మీరు నాకు ఎన్నికల్లో మద్దుతు ఇస్తే మీకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.

Buddha Venkanna : జగన్‌తో లూలూచీ పడ్డారా? లేక భయపడుతున్నారా..?: ముద్రగడకు బుద్దా వెంకన్న లేఖ

అన్ని పార్టీల నేతల్లా మీరు నన్ను చూడవద్దని మనిషి కష్టాన్ని అర్థం చేసుకునే వ్యక్తిని నేను మతాన్ని చూడను..మనిషి కష్టాన్ని మాత్రమే చూస్తానని అన్నారు. నన్ను ఓసోదరుడిలా భావించాలని కోరారు. ఏ మతంలోనైనా అతివాద భావజాలాన్ని మన అందరం ఖండించాలని పిలుపు నిచ్చారు. దేశ విభజన సమయంలో జిన్నా తీసుకున్న నిర్ణయం వల్ల ముస్లింలకు ప్రత్యేక దేశం అనే కారణంగా పాకిస్థాన్, భారత్ దేశాలు మత ప్రాతిపదికన విడిపోయాయని పవన్ ఈ సందర్భంగా గుర్తు చేస్తు ప్రస్తావించారు. నిజంగా భారతదేశం దుర్మార్గమైనదే అయితే 17 శాతం ఉన్న ముస్లింలు ఇలా కలిసి ఉండలేరని అన్నారు. భారత దేశం భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వం కలిగిన ప్రత్యేకదేశమని అటువంటి దేశంలో ముస్లింలు గౌరవంగా జీవిస్తున్నారని అన్నారు.

ఇస్లాం దేశమైన పాకిస్థాన్ లో హిందువులను చంపేశారు..వారిపై ఎన్నో దాడులు జరుగుతుంటాయి..కానీ మనదేశంలో అలా కాదు ముస్లింలను గౌరవిస్తామన్నారు. భారతదేశంలో ముస్లింలు 17శాతం ముంది ఉన్నారని వారంతా గౌరవంగా జీవిస్తున్నారని అన్నారు.

Mudragada Letter : పవన్ కల్యాణ్‌కు ముద్రగడ పద్మనాభం లేఖ, ఏమన్నారంటే..

 

ట్రెండింగ్ వార్తలు