బాలినేని అవినీతి, అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు జరిపించండి.. చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యే, జనసేన నేత వినతి

వైసీపీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబు నాయుడును ఎమ్మెల్యే దామచర్ల, జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ లు కోరారు.

Balineni Srinivasa Reddy

Balineni Srinivasa Reddy : ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు జరిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌, జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్‌ లు ఫిర్యాదు చేశారు. సచివాలయంలో చంద్రబాబును కలిసి పలు అంశాలతో కూడిన సమాచారం లేఖను ఆయన అందజేశారు. ఒంగోలులో బాలినేని వియ్యంకుడు కుంబా భాస్కర్‌రెడ్డి నిర్మిస్తున్న శ్రీకరి విల్లాస్‌ ప్రాజెక్టు నిర్మాణంలో చోటుచేసుకున్న అవకతవకలపై ప్రత్యేకంగా దర్యాప్తు చేయించాలని నేతలు కోరారు.

Also Read : Pawan Kalyan : అలాంటి మొక్కలను నాటకండి.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీడియో సందేశం..

యరజర్ల కొండలో గ్రావెల అక్రమ తవ్వకాలు నిబంధనలకు విరుద్ధంగా పైపులైన్‌ వేసి మంచినీటిని నిర్మాణ పనులకు వాడటం, నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వడంపై లోతైన దర్యాప్తు జరిపాలని చంద్రబాబును జనార్దన్, రియాజ్ లు కోరారు. యరజర్ల కొండల ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు భూమి అభివృద్ధి పేరుతో బాలినేని శ్రీనివాస్ రెడ్డి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని సీఎంకు వివరించారు. ఒంగోలులో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భూకబ్జాలపై సిట్‌ను ఏర్పాటు చేసినా సక్రమంగా దర్యాప్తు చేయలేదని నేతలు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. భూముల ఆక్రమణల్లో బాలినేనితోపాటు అతని సన్నిహితులు హస్తం కూడా ఉందని
సీఎంకు వివరించారు.

Also Read : Balakrishna Rare Photos : బాలయ్య తెరపై కనపడి నేటికి 50 ఏళ్ళు.. బాలకృష్ణ రేర్ ఫోటోలు చూసారా?

సిట్‌ను పటిష్ట పరచి విచారణ చేయించాలని చంద్రబాబు నాయుడును ఎమ్మెల్యే దామచర్ల, జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ లు కోరారు. ఎన్నికలకు ముందు హడావుడిగా పేదలకు పంపిణీ చేసిన నివాస స్థలాల్లో 12వేల మందికిపైగా బోగస్‌ లబ్ధిదారులు ఉన్నారని, దీనిపై దర్యాప్తు చేయించాలని కోరారు. లేఖలో పేర్కొన్న అంశాలన్నింటిని పరిశీలించి దర్యాప్తు చేయిస్తానని నేతలకు సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.

 

 

ట్రెండింగ్ వార్తలు