గతమంతా ఓ లెక్క.. ఇప్పుడు ఇంకో లెక్క.. ఏ రాష్ట్రంలో ఏయే నేత చిక్కుల్లో చిక్కుకున్నారు?

అపోజిషన్ అంటేనే ఇబ్బందులు తప్పవు. ఏ దేశమైనా.. ఏ రాష్ట్రమైనా.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతిపక్ష పార్టీ పరిస్థితి సముద్రానికి ఎదురొడ్డినట్లే ఉంటుంది. పైగా బలమైన నేతలను ఢీకొట్టి గెలవడం కూడా కష్టమే.

how opposition politicians facing ED and CBI investigation

India opposition politicians : దశాబ్ధాల తరబడి రాజకీయ అనుభవం. సింగిల్ హ్యాండ్‌తో నెట్టుకొచ్చిన అడ్మినిస్ట్రేషన్ ఎక్స్‌పీరియన్స్. ఇవేవి ఆ రాజకీయ నాయకులను కాపాడటం లేదు. ప్రజల మద్దతుతో ఉన్నత పదవుల్లో ఉంటున్నా.. నిత్యం ఏదో ఒక తలనొప్పి ఆ లీడర్లను ఇబ్బంది పెడుతూనే ఉంది. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని.. కాలం పెట్టే పరీక్షలకు ఎవరూ అతీతులు కాదని ఆ నేతలు ఎదుర్కొంటున్న సమస్యలను చూస్తే అర్థమవుతుంది.

దేశమంతా ఒకవైపు.. దీదీ మరోవైపు
ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్‌గా ఉన్నారు పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ. మూడోసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతోన్న దీదీకి.. అంతకముందు రెండుసార్లు కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం కూడా సొంతం. కానీ ట్రైనీ డాక్టర్‌ హత్యాచారం ఘటన మమతను అభాసుపాలు చేస్తుంది. ఓవైపు సీబీఐ ఎంక్వైరీ.. మరోవైపు విద్యార్థుల ఆందోళనలు, ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి.. అపోజిషన్ నుంచి పొలిటికల్ ప్రెజర్ ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇవన్నీ దీదీ పాపులారిటీకి డ్యామేజ్ చేస్తుండటంతో పాటు.. విద్యార్థుల ఆందోళనలతో పశ్చిమబెంగాల్ అట్టుడికిపోతోంది. ప్రాబ్లమ్ ఏదైనా తన కనుసైగలతో చక్కబెట్టుకుంటూ వచ్చిన సీఎం మమత బెనర్జీ.. ఇప్పుడు ఒకే ఒక్క ఘటనతో అందరికీ టార్గెట్ అయిపోయారు. మహిళా డాక్టర్ అత్యాచారం, హత్య కేసుపై పబ్లిక్ నుంచి తీవ్రస్థాయిలో రియాక్షన్ వచ్చింది. యావత్ దేశమంతా ఒకవైపు.. దీదీ మరోవైపు అన్నట్లుగా మారిపోయింది సీన్.

వరుసగా మూడోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టి రికార్డు క్రియేట్ చేశారు మమత. సింగిల్‌గా పోరాడి బీజేపీతో నెక్ టు నెక్ ఫైట్‌లో.. అటు కమ్యూనిస్టులను.. ఇటు కమలం పార్టీని ఓడించి మరీ అధికారంలోకి వచ్చారు. మూడోసారి పవర్‌లోకి వచ్చాక దీదీని వరుసగా సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఆమె క్యాబినెట్ మంత్రులపై ఈడీ రైడ్స్, టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్, తన బంధువులపై ఆరోపణలతో చిక్కుల్లో ఉన్నారు మమత. అంతలోనే ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటన ఆమె మెడకు చుట్టుకుంది. ఈ పరిస్థితులు దీదీకి సవాల్‌గా మారాయి. ఓ వైపు ఉరుముతున్న విద్యార్థి ఉద్యమం, మరోవైపు ప్రధాన ప్రతిపక్షం బీజేపీ నుంచి విమర్శల దాడి పెరుగుతుండటంతో.. గతంలో ఎప్పుడూ లేనంత వ్యతిరేకత ఫేస్ చేస్తున్నారు మమత.

మోదీ, అమిత్‌షాను ఢీకొట్టి నిలబడిన నేతగా.. దేశవ్యాప్తంగా ఆమెకు ఉన్న ఇమేజే వేరు. కానీ ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటన ఆమె పొలిటికల్ కెరీర్‌కే మచ్చ తెస్తున్నట్లు కనిపిస్తోంది. నిందితులకు పడే శిక్షపైనే మమత పొలిటికల్ ఫ్యూచర్ ఆధారపడి ఉందంటున్నారు ఎనలిస్ట్‌లు. దేశంలో ఏ ఇన్సిడెంట్ జరిగినా మోదీపై అటాక్ చేసే మమత.. ఇప్పుడు అందరికీ టార్గెట్గా మారి ఒంటరిగా నిలిచారు..

సిద్ధరామయ్యకు తలనొప్పిగా ముడా, వాల్మికీ స్కామ్
ఇక లేటెస్ట్‌గా కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై వచ్చిన ఆరోపణలు అయితే చాలా ఇంట్రెస్టింగ్. ఎంటైర్ రాజకీయ జీవితంలో మచ్చలేని నేతగా.. క్లీన్ ఇమేజ్ ఉన్న లీడర్‌గా ఆయనకు పేరుంది. ముడా స్కామ్ సిద్ధరామయ్యకు తలనొప్పిగా మారింది. తన భార్య పేరుమీదున్న భూమిని ప్రభుత్వం తీసుకోవడం.. అందుకు బదులుగా మరోచోట స్థలాలు ఇవ్వుమని సిద్ధరామయ్య లెటర్ రాసినట్లు ఆరోపణలు రావడం సంచలనమైంది. అంతలోపే వాల్మికీ స్కామ్ తెరపైకి రావడంతో.. సిద్ధరామయ్య టార్గెట్‌గా ఆరోపణలు, విచారణలు పెరిగిపోయాయి.

కర్ణాటక రాజకీయాల్లో సిద్దరామయ్య బ్రాండ్ ఇమేజే వేరు. మాస్ లీడర్‌గా.. కాంగ్రెస్ సీనియర్ నేతగా.. బలమైన కురుబ సామాజిక వర్గం నుంచి ఎదిగిన నాయకుడిగా సిద్దరామయ్యకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఆయన రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చలేదు. అపోజిషన్‌లో ఉన్న చాలామంది లీడర్లు ఈడీ కేసులు ఎదుర్కొంటున్నారు. సిద్దరామయ్యపై అలాంటి కేసులు లేవు.. ఆరోపణలు అంతకన్నా లేవు. ఫస్ట్ టైమ్ తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో.. పదవిని అడ్డుపెట్టుకుని అక్రమాలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఇష్యూతో ఏకంగా సిద్ధరామయ్యను సీఎం పదవి నుంచి తప్పిస్తారన్న ప్రచారం తెరపైకి వచ్చింది.

అపోజిషన్ లీడర్లను వెంటాడుతోన్న చిక్కులు
అపోజిషన్ అంటేనే ఇబ్బందులు తప్పవు. ఏ దేశమైనా.. ఏ రాష్ట్రమైనా.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతిపక్ష పార్టీ పరిస్థితి సముద్రానికి ఎదురొడ్డినట్లే ఉంటుంది. పైగా బలమైన నేతలను ఢీకొట్టి గెలవడం కూడా కష్టమే. ఒకవేళ గెలిచినా నెట్టుకురావడం ఇంకా ఇబ్బంది. ఇప్పుడిదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు పలు పార్టీల నేతలు. బీజేపీ లాంటి స్ట్రాంగ్ పార్టీని ఓడించి కేజ్రీవాల్ ఢిల్లీకి మూడోసారి సీఎం అయ్యారు. థర్డ్ టైమ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టాక ఆయనను సమస్యలు చుట్టుముట్టాయి.

లిక్కర్ స్కామ్ సంక్షోభంలో ఆమ్ ఆద్మీ పార్టీ
లిక్కర్ స్కామ్ కేసు ఆమ్ ఆద్మీ పార్టీని సంక్షోభంలో పడేసింది. సీఎం కేజ్రీవాల్‌తో పాటు ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా.. ఎంపీ సంజయ్‌సింగ్ జైలుకు వెళ్లారు. కేజ్రీవాల్ ఇంకా జైలులోనే ఉన్నారు. మరో మంత్రి సత్యేంద్ర జైన్ ఇంకో కేసులో జైలుకు వెళ్లి వచ్చారు. ఇలా ఆమ్ ఆద్మీ పార్టీ టాప్ లీడర్లంతా కేసులు ఎదుర్కొంటున్నారు. అవినీతి రహిత పాలన పేరుతో ఏర్పాటైన ఆప్ పార్టీ.. కరప్షన్ అలిగేషన్స్‌తో రౌండప్ అయిపోయింది. వచ్చే ఏడాది స్టార్టింగ్‌లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అప్పటివరకు కేజ్రీవాల్ బయటికి వస్తారా లేదా అన్నది అనుమానంగా ఉంది.

సోరెన్‌ను వెంటాడుతున్న ఈడీ కేసులు
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే మనీలాండరింగ్ కేసులో జైలుకెళ్లి వచ్చారు. జైలుకు వెళ్లే ముందు చంపై సోరెన్‌ను సీఎం చేశారు హేమంత్ సోరెన్. బెయిల్‌పై వచ్చాక మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో నొచ్చుకున్న చంపై సోరెన్ ఏకంగా JMM పార్టీకి రిజైన్ చేసి.. బీజేపీతో టచ్‌లోకి వెళ్లిపోయారు. చంపై సోరెన్‌ చేరిక తర్వాత కమలం పార్టీ ఏదైనా ఆపరేషన్ చేపడుతుందా అన్న ఆందోళన హేమంత్ సోరెన్‌ను వెంటాడుతోంది.

Also Read : కశ్మీర్ ఎన్నికలు.. ఇండియా కూటమిలో పార్టీల మధ్య కుదిరిన పొత్తు.. కాంగ్రెస్‌కు ఎన్ని స్థానాలంటే?

గవర్నర్ ఆర్‌ఎన్ రవితో.. స్టాలిన్‌కు తలనొప్పులు
ఇక తమిళనాడులో పరిస్థితి మరోలా ఉంది. గవర్నర్ ఆర్‌ఎన్ రవితో.. స్టాలిన్ సర్కార్ ఎప్పుడూ తలనొప్పులు ఉంటూనే ఉన్నాయి. తమిళనాడు పేరును తమిళిగం చేయాలన్న గవర్నర్‌ మాటలపై గొడవ జరిగింది. గెట్‌ అవుట్‌ రవి పేరుతో తమిళనాట అంతటా పోస్టర్లు అంటించింది డీఎంకే. ఎన్నికలకు ముందు కచ్చతీవు ఇష్యూ మరో అగ్గిరాజేసింది.. గవర్నర్ బీజేపీ డైరెక్షన్‌లో పనిచేస్తూ ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడుతోంది డీఎంకే. ఇక స్టాలిన్ క్యాబినెట్ మంత్రులపై ఈడీ కేసులు, 11మంది మినిస్టర్లపై అవినీతి ఆరోపణలు రావడం తలనొప్పిగా మారింది. అయినా ఎంపీ ఎన్నికల్లో 39 సీట్లు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది డీఎంకే కూటమి. ఎన్ని ఇబ్బందులు, ఒత్తిళ్లు ఉన్నా కాంగ్రెస్‌తో కలసి నడుస్తూ..బీజేపీని ఢీకొడుతూనే ఉన్నారు స్టాలిన్.

Also Read : వివాదంలో హీరో విజయ్ పార్టీ జెండా.. ఫిర్యాదు చేసిన బీఎస్పీ పార్టీ..

రెండుగా చీలిపోయిన మహా పార్టీలు
ఇక మహారాష్ట్రలో NCP పార్టీ రెండుగా చీలిపోయింది. శివసేన రెండుగా విడిపోయింది. ఆ రెండు పార్టీలు ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో సత్తా చాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కసితో ఉన్నాయి. ఇక తెలంగాణలో మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌ను ఈడీ కేసులు వెంటాడుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసులో జైలుకు వెళ్లి వచ్చారు. పలువురు గులాబీ పార్టీ నేతలపై కూడా ఆరోపణలు ఉన్నాయి. దేశంలో ప్రాంతీయ పార్టీలు, విపక్ష పార్టీల సీఎంలను ఎప్పుడూ ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. వెస్ట్ బెంగాల్ సీఎం మమత బెనర్జీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను అయితే ఉన్నఫళంగా సమస్యలు చుట్టుముట్టాయి. ఇప్పటి విపత్కర పరిస్థితుల నుంచి బయటపడటం ఆ ఇద్దరు నేతలకు సవాల్‌గా మారింది.

ట్రెండింగ్ వార్తలు