Vijay Party Flag : వివాదంలో హీరో విజయ్ పార్టీ జెండా.. ఫిర్యాదు చేసిన బీఎస్పీ పార్టీ..

ఇటీవల విజయ్ తన పార్టీ జెండాని ఆవిష్కరించాడు.

Vijay Party Flag : వివాదంలో హీరో విజయ్ పార్టీ జెండా.. ఫిర్యాదు చేసిన బీఎస్పీ పార్టీ..

Bahujan Samaj Party Complaint on Tamil Hero Vijay Party Flag

Updated On : August 28, 2024 / 10:22 AM IST

Vijay Party Flag : తమిళ్ స్టార్ హీరో విజయ్ తమిళ వెట్రి కజగం అనే రాజకీయ పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. తమిళనాడులో జరిగే 2026 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తన పార్టీని ఇప్పట్నుంచే బలోపేతం చేస్తున్నాడు విజయ్. ఇటీవల విజయ్ తన పార్టీ జెండాని ఆవిష్కరించాడు. చెన్నైలో తన పార్టీ కార్యాలయంలో విజయ్ తమిళ వెట్రి కజగం పార్టీ జెండాను అధికారికంగా ఆవిష్కరించాడు.

విజయ్ పార్టీ జెండాలో.. పైన కింద రెడ్ కలర్ తో, మధ్యలో పసుపు కలర్, మధ్యలో రెండు ఏనుగులు ఘీంకరిస్తుండగా వాటి మధ్యలో ఒక పువ్వు వికసించినట్టు, దాని చుట్టూ స్టార్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ జెండా వివాదంలో నిలిచింది. విజయ్ పార్టీ జెండాపై ఎన్నికల కమిషన్ కి బహుజన సమాజ్ పార్టీ ఫిర్యాదు చేసింది.

Also Read : Vijay : పార్టీ జెండాని ఆవిష్కరించిన విజయ్.. ఇదే విజయ్ పార్టీ జెండా.. ఇక తమిళ రాజకీయాల్లో దూకుడు..

బహుజన సమాజ్ పార్టీ తమ ఫిర్యాదులో.. తమిళ హీరో దళపతి విజయ్ టీవీకే పార్టీ జెండాపై ఏనుగు గుర్తు తమ పార్టీలోని గుర్తును పోలి ఉందని, పార్టీ జెండాలో ఏనుగు గుర్తును అక్రమంగా, రాజకీయ నాగరికత తెలియకుండా ఉపయోగించారని తెలిపి దీనిపై తక్షణమే చర్యలు త్రీసుకోవాలని కోరారు. మరి దీనిపై విజయ్ కానీ ఆ పార్టీ నాయకులు కానీ స్పందిస్తారా చూడాలి.