Vijay : పార్టీ జెండాని ఆవిష్కరించిన విజయ్.. ఇదే విజయ్ పార్టీ జెండా.. ఇక తమిళ రాజకీయాల్లో దూకుడు..
ప్రస్తుతం విజయ్ పార్టీ జెండా తమిళ మీడియాలో వైరల్ గా మారింది.

Tamil Star Hero Vijay Launch his Political Party Tamilaga Vettri Kazhagam Flag
Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ ఇటీవలే రాజకీయ పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. ‘తమిళ వెట్రి కజగం’ అనే పేరుతో విజయ్ పార్టీని స్థాపించాడు. విజయ్ రాజకీయాల్లోకి వస్తాడు అనే వార్తలకు తన ఎంట్రీతో ముగింపు ఇచ్చాడు. అయితే విజయ్ పార్టీ పెట్టినా తమిళనాడులో జరిగే 2026 అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేస్తానని, అంతకంటే ముందు జరిగే ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయనని స్పష్టం చేసాడు.
ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసేసి వచ్చే సంవత్సరం నుంచి విజయ్ రాజకీయాలపై దృష్టి పెట్టనున్నాడు. తాజాగా విజయ్ నేడు తన పార్టీ జెండాని ఆవిష్కరించాడు. చెన్నైలో జరిగిన తన పార్టీ కార్యక్రమంలో విజయ్ పాల్గొని పార్టీ జెండాని ప్రకటించి, అక్కడే ఆవిష్కరించి దాని గురించి మాట్లాడాడు. విజయ్ తమిళ వెట్రి కజగం పార్టీ జెండా.. పైన కింద రెడ్ కలర్ తో, మధ్యలో పసుపు కలర్ తో ఉంది. మధ్యలో రెండు ఏనుగులు ఘీంకరిస్తుండగా వాటి మధ్యలో ఒక పువ్వు వికసించినట్టు, దాని చుట్టూ స్టార్స్ ఉన్నాయి.
ప్రస్తుతం విజయ్ పార్టీ జెండా తమిళ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే పార్టీ ప్రకటించి, ఇప్పుడు జెండాని ఆవిష్కరించడంతో త్వరలోనే తమిళ రాజకీయాల్లో విజయ్ దూకుడు ప్రదర్శిస్తాడని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. మరి విజయ్ 2026 తమిళనాడు ఎన్నికల్లో తన పార్టీ ద్వారా ఏ మాత్రం ప్రభావం చూపిస్తాడో చూడాలి.
#WATCH | Tamil Nadu: Actor and Tamilaga Vettri Kazhagam (TVK) chief Vijay unveils the party's flag at the party office in Chennai.
(Source: ANI/TVK) pic.twitter.com/YaBOYnBG6j
— ANI (@ANI) August 22, 2024
Official flag of #TVK#TVKFlagHoisting #TVKFlag #vijay pic.twitter.com/eMZEFPkydd
— Rajagopal Mookaiyah (@rgtwtz) August 22, 2024