Indra Making Video : ఇంద్ర సినిమా సాంగ్ మేకింగ్ వీడియో చూశారా? చిరు పక్కన చిన్ని చరణ్, డ్యాన్స్ మాస్టర్ లారెన్స్..
తాజాగా ఇంద్ర సినిమాలోని అమ్మడు అప్పచ్చి.. సాంగ్ మేకింగ్ వీడియోని రిలీజ్ చేసారు వైజయంతి మూవీస్ నిర్మాణ సంస్థ.

Chiranjeevi Indra Movie Song Making Video Released by Vyjayanthi Movies
Chiranjeevi Indra Making Video : నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఇంద్ర సినిమాని రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో అభిమానులంతా థియేటర్స్ లో ఇంద్ర సినిమా చూసి సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో ఇంద్ర రీ రిలీజ్ కి ప్రమోషన్స్ కూడా చేస్తుంది నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్. తాజాగా ఇంద్ర సినిమాలోని అమ్మడు అప్పచ్చి.. సాంగ్ మేకింగ్ వీడియోని రిలీజ్ చేసారు వైజయంతి మూవీస్ నిర్మాణ సంస్థ.
దీంతో ఇంద్ర సినిమాలోని ఈ సాంగ్ మేకింగ్ వీడియో వైరల్ గా మారింది. ఇందులో చిరంజీవికి లారెన్స్ స్టెప్పులు నేర్పించడం, చిరంజీవి పక్కన చరణ్, శ్రీజ ఉండటం, చిరుతో నిర్మాత అశ్విని దత్ ముచ్చట్లు. చిరు, ఆర్తి అగర్వాల్ స్టెప్స్, చరణ్ తో అశ్వినీదత్ ముచ్చట్లు.. ఇలా అన్ని ఉన్నాయి. దీంతో ఈ సాంగ్ మేకింగ్ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు అభిమానులు. మీరు కూడా ఈ మేకింగ్ వీడియో చూసేయండి..