ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంపై మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు..

రోజా వైసీపీని వీడనున్నారని, ఏపీ రాజకీయాల నుంచే తప్పుకోనున్నారని, తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని ప్రచారం కూడా జరిగింది.

Roja (Photo Credit : Facebook)

Roja On Ysrcp Defeat : నగరి నియోజకవర్గంలో పుత్తూరులో నూతనంగా నిర్మించిన బలిజ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి రోజా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన రోజా.. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు సునామీలా వచ్చి వెళ్ళిపోయాయని రోజా అన్నారు.

ఇది ప్రజలు ఇచ్చిన ఓటమి కాదన్న రోజా.. ఏం జరిగిందన్నది ఏదో ఒక రోజు బయటకు వస్తుందని వ్యాఖ్యానించారు. ఇంత ఘోరంగా ఓడిపోవాల్సిన తప్పులు మనం చేయలేదని కామెంట్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఎలా అందుబాటులో ఉన్నామో… ప్రతిపక్షంలో కూడా అలానే ఉంటామని స్పష్టం చేశారు. ఇక్కడే ఉంటాను. మిమ్మల్ని నా కుటుంబసభ్యులుగా చూసుకుంటాను అని హామీ ఇచ్చారు రోజా. మీ సోదరిగా మీకు అందుబాటులో ఉంటూ చేయగలిగింది చేస్తానని మాటిచ్చారు రోజా.

Also Read : ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీపై సస్పెన్స్ ఇంకెన్నాళ్లు? బీజేపీ డిమాండ్ ఏంటి?

కాగా, ఎన్నికల ఫలితాల తర్వాత రోజా సైలెంట్ అయిపోయారు. వైసీపీ ఫైర్ బ్రాండ్ లీగర్ గా గుర్తింపు పొందిన రోజా, మంత్రిగా ఉన్న సమయంలో పదునైన విమర్శలతో టీడీపీ, జనసేనలపై మాటల తూటాలు పేల్చారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ పై ఈగ కూడా వాలనిచ్చే వారు కాదు. అలాంటి రోజా.. ఎన్నికల్లో వైసీపీ దారుణ ఓటమి తర్వాత డీలాపడ్డారు. చాలా రోజుల పాటు ఆమె మౌనంగా ఉన్నారు. ఇంటికే పరిమితం అయ్యారు. ఎక్కువ సమయం చెన్నైలోనే గడిపారు. మీడియా ముందుకు కూడా రాలేదు. అంతేకాదు రోజా వైసీపీని వీడనున్నారని, ఏపీ రాజకీయాల నుంచే తప్పుకోనున్నారని, తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని ప్రచారం కూడా జరిగింది. అయితే, తాజాగా రోజా చేసిన వ్యాఖ్యలతో ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్లు అయ్యింది.

 

ట్రెండింగ్ వార్తలు