Pawan Letter CM Jagan : సీఎం జగన్ కు పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు జనసేనాని పవన్ కళ్యాణ్ బహిరంగంగా లేఖ రాశారు. సామాజిక పింఛన్ల తొలగింపు దిశగా జారీ చేస్తున్న నోటీసులను జనసేనాని తప్పు పట్టారు. విద్యుత్ బిల్లు పెరిగిందనో, ఇంటి విస్తీర్ణం ఎక్కువైందనో రద్దు చేయాలని చూడడం విచిత్రంగా ఉందన్నారు.

Pawan Letter CM Jagan : ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు జనసేనాని పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాశారు. సామాజిక పింఛన్ల తొలగింపు దిశగా జారీ చేస్తున్న నోటీసులను జనసేనాని తప్పు పట్టారు. విద్యుత్ బిల్లు పెరిగిందనో, ఇంటి విస్తీర్ణం ఎక్కువైందనో రద్దు చేయాలని చూడడం విచిత్రంగా ఉందన్నారు. వేల ఎకరాల భూములున్నాయని, వందల ఇళ్లు ఉన్నాయనే సాకులు చూపిస్తూ కొందరికి నోటీసులు ఇచ్చారని, అవి ఎక్కడో చూపించే వారికి పట్టాలివ్వాలని సెటైరు వేశారు.

పింఛన్లు ఎందుకు తొలగించకూడదో చెప్పాలంటూ 4 లక్షల లబ్ధిదారులకు నోటీసులు జారీ చేశారని పేర్కొన్నారు. పేదలైన వృద్ధులు, దివ్వాంగులు, వితంతువులకు పింఛన్ లకు దూరం చేయడం సరికాదన్నారు. ప్రతి నెలా ఇచ్చే సామాజిక పింఛన్లను తగ్గించుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కసరత్తులు పేదలను ఇబ్బందులకు గురిచేసేవిగా ఉన్నాయని విమర్శించారు.

Pawan kalyan : జనసేన ’వారాహి’ వాహనం రంగుపై వైసీపీ విమర్శలకు పవన్ కల్యాణ్ కౌంటర్

సామాజిక పింఛన్లు తొలగింపు అంశానికి సంబంధించిన వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం జగన్ కు పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖను రాశారు. పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ లో లేఖను పోస్టు చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో మొత్తం 4 లక్షల మంది లబ్ధిదారులకు నోటీసులు జారీ చేశారని పేర్కొన్నారు. వాళ్లందరికి ఎందుకు నోటీసులు జారీ చేశారో, నోటీసులో ఇచ్చిన కారణాలు కూడా అంత సహేతికంగా లేవంటూ ఈ లేఖలో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు