NTR 100 Rupees Coin: ఎన్టీఆర్‌ స్మారక నాణెం విడుదల.. ఢిల్లీకి చేరిన చంద్రబాబు, పురంధరేశ్వరి.. ఎవరెవరు పాల్గొంటున్నారంటే

రూ. 100 స్మారక నాణేన్ని 50శాతం వెండి, 40శాతం రాగి, ఐదు శాతం నికెల్, ఐదు శాతం జింక్ తో తయారు చేశారు. నాణేం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎన్టీఆర్ జీవిత విశేషాలతో..

NTR 100 Rupees Coin

NTR Rs 100 Coin Release: తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన రూ. 100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సోమవారం విడుదల చేయనున్నారు. రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో ఉదయం 10.30గంటల నుంచి జరిగే ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కూడా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరితో పాటు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు.

NTR 100 Rupees Coin : ఢిల్లీలో ఎన్టీఆర్ రూ.100 నాణేం విడుదల చేయనున్న రాష్ట్రపతి.. హాజరుకానున్న చంద్రబాబు

ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన రూ.100 స్మారక నాణేన్ని ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా సుమారు 200 మంది వరకు ఆహ్వానాలు అందినట్లు తెలిసింది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు, రాజకీయ, సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గోనున్నారు. పార్టీ స్థాపించిన నాటినుంచి ఎన్టీఆర్ వెన్నంటి ఉన్న అయ్యన్న పాత్రుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కుంభంపాటి రామ్మోహన్ రావు, ఎద్దులపల్లి సుబ్రహ్మణ్యం, సినీ నిర్మాతలు చలసాని అశ్వినీదత్, దగ్గుబాటు సురేశ్, విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత రత్తయ్యతో పాటు 200 మంది వరకు అతిథులకు ఆహ్వానాలు అందినట్లు తెలిసింది. ఇదిలాఉంటే లక్ష్మీపార్వతికి ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందలేదు. ఈసందర్భంగా ఆమె రాష్ట్రపతికి లేఖ రాశారు. ఆహ్వానితుల లిస్టులో తన పేరును చేర్చకుండా చంద్రబాబుతోపాటు ఇతర కుటుంబ సభ్యులను ఆహ్వానించడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.

Gold Price Today: మహిళలకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే ..

రూ. 100 స్మారక నాణేన్ని 50శాతం వెండి, 40శాతం రాగి, ఐదు శాతం నికెల్, ఐదు శాతం జింక్ తో తయారు చేశారు. నాణేం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎన్టీఆర్ జీవిత విశేషాలతో 20 నిమిషాలపాటు వీడియో ప్రదర్శన ఇస్తారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎన్టీఆర్ 100 రూపాయల స్మారక నాణేన్ని ప్రారంభిస్తారు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా నిమ్మకూరులో 1923మే28న జన్మించారు. ఆ తరువాత స్వయం కృషితో సినీ, రాజకీయ రంగాలలో తనదైన చెరగని ముద్ర వేశారు. చిరస్థాయిగా నిలిచిపోయేలా ఆయన సమాజానికి అందించిన సేవలకు గుర్తుగా శతజయంతి సంవత్సరం సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక రూ. 100 నాణేన్ని ముద్రించింది.

ట్రెండింగ్ వార్తలు