Ap news: మహిళను స్తంభానికి కట్టేసిన గ్రామస్థులు.. ఆమె చేసిన పనికి ..

మహిళను గ్రామంలోని స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటన ఏపీలో చోటు చేసుకుంది. కొద్దిరోజుల తరువాత కనిపించిన మహిళను ఈడ్చుకొని వచ్చిన ఆ గ్రామ మహిళలు.. స్తంభానికి కట్టేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను విడిపించారు. ఈ క్రమంలో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య వివాదం చోటు చేసుకుంది.

Ap news: మహిళను గ్రామంలోని స్తంభానికి కట్టేసి ఘటన ఏపీలో చోటు చేసుకుంది. కొద్దిరోజుల తరువాత కనిపించిన మహిళను ఈడ్చుకొని వచ్చిన ఆ గ్రామ మహిళలు.. స్తంభానికి కట్టేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను విడిపించారు. ఈ క్రమంలో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య వివాదం చోటు చేసుకుంది. అయితే ఈ వివాదానికి సంబంధించిన కేసు కోర్టులో ఉండటంతో గ్రామస్తులు జోక్యం చేసుకోవద్దంటూ పోలీసులు హెచ్చరించారు. దీంతో మహిళలను కట్టేసిన ఎనిమిది మంది గ్రామస్తులపై కేసు నమోదు చేశారు.

Drunken Rooster: మ‌ందు లేనిదే ముద్ద ముట్ట‌దు.. కోడిపుంజు విచిత్ర ప్ర‌వ‌ర్త‌న‌..!

ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం శివిని గ్రామానికి చెందిన మహిళ.. గ్రామంలో చిట్టీల వ్యాపారం నడిపిస్తోంది. కొన్ని సంవత్సరాలుగా చిట్టీల వ్యాపారం కొనసాగిస్తోంది. అయితే గ్రామస్తులు ఆమె వద్ద చిట్టీ వేశారు. కొంతకాలంకు చిట్టీల డబ్బులు జమ అవుతున్నాయికానీ డబ్బులు మాత్రం తిరిగి ఇవ్వడం లేదు. చిట్టీలు ఎత్తుకున్న వారికి డబ్బులు ఇవ్వకపోవటంతో నెలవారి వడ్డీనిసైతం చెల్లించడం లేదు. ఈ క్రమంలో పలుసార్లు సదరు మహిళను ప్రశ్నించడంలో తన వద్ద డబ్బులు లేవని వచ్చాక ఇస్తానంటూ తేల్చి చెప్పింది. డబ్బుల కోసమని నాపై ఒత్తిడి తెస్తే ఆత్మహత్య చేసుకొని చనిపోతానని బెదిరింపులకుసైతం దిగింది. దీంతో చేసేదేమీలేక గ్రామస్తులు మహిళపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఏప్రిల్ 7న కేసు నమోదు చేశారు. అయితే ఈ వివాదం కోర్టుకు వెళ్లింది.

Deodorant Adds: ఆ వీడియోలు తొలగించండి.. ట్విటర్, యూట్యూబ్‌లకు కేంద్రం కీలక ఆదేశాలు

అప్పటి నుంచి మహిళ గ్రామంలోకి రాకుండా తప్పించుకొని తిరుగుతుంది. పలు ప్రాంతాల్లో మహిళ ఆచూకీకోసం గ్రామస్తులు వెతికినప్పటికీ ఉపయోగం లేదు. కాగా శనివారం మహిళ ఆ ప్రాంతానికి రావడాన్ని గమనించిన గ్రామ మహిళలు ఆగ్రహంతో ఊగిపోయారు. మహిళను పట్టుకొని ఈడ్చుకుంటూ వచ్చి స్తంభానికి కట్టేశారు. గ్రామస్తుల నుంచి చిట్టీల పేరుతో సదరు మహిళ రూ.1.40 కోట్లు సేకరించినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి వచ్చి ఆమెను విడిపించారు. ఎనిమిది మంది గ్రామస్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తమ వద్ద డబ్బులు తీసుకొని ఇవ్వకుండా దర్జాగా తిరుగుతుంటే పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని గ్రామస్తులు ప్రశ్నించారు. ఈక్రమంలో పోలీసులపై కొందరు గ్రామస్తులు వాగ్వివాదంకుదిగి మహిళలను అప్పగించాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉధ్రిక్తంగా మారకుండా పోలీసులు సదరు మహిళను స్టేషన్ కు తరలించారు.

ట్రెండింగ్ వార్తలు