Weather Forecast : ఆంధ్రప్రదేశ్‌లో మరో 3 రోజుల పాటు వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా ఏపీలోని పలు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు తీ

Weather Forecast : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా ఏపీలోని పలు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మరో మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో  వర్షాలు  కురుస్తాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. నిన్న నైరుతి బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో  ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఆవర్తనం ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా  సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్లు ఎత్తు వరకు వ్యాపించి ఉంది.
Also Read : CM Jagan Sankranti : సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్ దంపతులు
దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

ట్రెండింగ్ వార్తలు