Visakha East: విశాఖ తూర్పు నియోజకవర్గంపై వైసీపీ స్పెషల్ ఫోకస్.. ఎమ్మెల్యేగా ఎంపీకి చాన్స్!

విశాఖ తూర్పు నియోజకవర్గం ఓటర్లు తీర్పు ఈ సారి తనకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంటోంది అధికార వైసీపీ.. గత మూడు ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ జెండాయే ఎగురుతోంది.

why ysr congress party special focus on visakhapatnam east assembly constituency

visakhapatnam east constituency: విశాఖనగరం అధికార వైసీపీకి ప్రతిష్టాత్మకం.. సీఎం జగన్ కూడా వైజాగ్‌పై (Vizag) స్పెషల్ ఫోకస్ పెట్టారు. దసరా నుంచి విశాఖకు తరలిపోవాలని పట్టుదలతో ఉన్నారు. రాష్ట్రంలో మరే నగరానికి ఇవ్వనంత ప్రాధాన్యం ఇస్తున్న విశాఖలో రాజకీయంగా (Visakha Politics) వైసీపీకి సరైన ఫలితాలు రావటం లేదు. గత ఎన్నికల్లో నగరంలో 4 చోట్ల గెలిచింది టీడీపీ (TDP). రాష్ట్రం మొత్తం హవా నడిచినా విశాఖలో ఒక్కస్థానానికే పరిమితమైంది వైసీపీ. ఈ పరిస్థితుల్లో నగరంలోని కీలక నియోజకవర్గమైన తూర్పుపై ప్రత్యేక దృష్టి పెట్టింది వైసీపీ.. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను (mvv satyanarayana) రంగంలోకి దింపి వచ్చే ఎన్నికల్లో తూర్పు తీరాన వైసీపీ జెండా ఎగరేయాలని ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం అధికార పార్టీ అనుసరిస్తున్న వ్యూహమేంటో తెరవెనుక చూద్దాం.

విశాఖ తూర్పు నియోజకవర్గం ఓటర్లు తీర్పు ఈ సారి తనకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంటోంది అధికార వైసీపీ.. గత మూడు ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ జెండాయే ఎగురుతోంది. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు (Velagapudi Ramakrishna Babu) అడ్డాగా మారిపోయింది విశాఖ తూర్పు. కార్పొరేటర్‌గా రాజకీయాలు ప్రారంభించిన వెలగపూడి క్షేత్రస్థాయి నుంచి కార్యకర్తల్లో పాతుకుపోయారు. ఎమ్మెల్యేకు సరైన ప్రత్యర్థిని దింపడంలో గత రెండుసార్లు వైసీపీ అంచనాలు తప్పాయి. అంగ, అర్ధబలాల్లో తిరుగులేని వెలగపూడిని ఈ సారి ఇంటికి పంపడంపై ప్రధానంగా ఫోకస్ పెట్టింది వైసీపీ.. తూర్పు తలరాత మార్చేలా వెలగపూడికి మించిన స్థాయిలో అంగ, అర్ధబలాలు ఉన్న దీటైన నేత, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను విశాఖ తూర్పు ఇన్‌చార్జిగా నియమించింది వైసీపీ.

Also Read: అసలు నారా లోకేశ్ హస్తినకు ఎందుకు వెళ్లారు.. అక్కడ ఏం చేస్తున్నారు?

ఎంపీ ఎంవీవీ.. విశాఖ తూర్పు ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టడంతో రాజకీయం సమూలంగా మారిపోయింది. వెలగపూడి మాస్ లీడర్.. ఓ ప్రధాన సామాజిక వర్గం నేత.. ఆయనకు దీటైన నేతగా విశాఖలో ఎంపీ సత్యానారాయణను వైసీపీ ఎంచుకోవడానికి కూడా అదే సామాజికవర్గం కారణం కావడం విశేషం. ఇక ఆర్థికంగా తిరుగులేని ఎంపీ ఎంవీవీ అయితేనే టీడీపీ హవాకు బ్రేక్‌లు వేయగలమని భావించింది వైసీపీ.. అంతేకాదు ఎంపీ ఎంవీవీకి కూడా ఎమ్మెల్యేగా పనిచేయాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. విశాఖలో నెంబర్ వన్ బిల్డర్ అయిన ఎంవీవీ గత ఎన్నికల్లో అనూహ్యంగా ఎంపీగా పోటీ చేయాల్సివచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా చాన్స్ కోరుకున్న ఆయనకు అధిష్టానం వరమిచ్చింది.. తూర్పు బాధ్యతలు అప్పగించింది గెలిచి రావాలంటూ ఆదేశించిందట.

Also Read: జగన్ పెట్టిన టెస్ట్‌లో పాసయ్యేదెవరు, ఫెయిలయ్యేదెవరు?

ఎమ్మెల్యే అవ్వాలనే తన కోరికకు అధిష్టానం కూడా ఓకే చెప్పడంతో ఎంపీ ఎంవీవీ.. తూర్పు నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలో విందు రాజకీయాలు మొదలుపెట్టిన ఎంపీ.. యవతను ఆకర్షించే రీతిలో ప్రత్యేక బహుమతులు పంపిణీ చేస్తున్నారు. ఎలాగైనా సరే వెలగపూడి దూకుడికి బ్రేక్ వేసి టీడీపీ హవాకు చెక్ చెప్పేలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఐతే గత ఇన్‌చార్జి విజయనిర్మల మాత్రం ఇంకా టికెట్ ఆశలో ఉన్నారు. ఇప్పటివరకు ఎంపీ ఎంవీవీకి ఆమె మద్దతు ప్రకటించలేదు. ఆమెతో కూడా సయోధ్యకు ప్రయత్నిస్తున్నారు ఎంపీ.. అధిష్టానం ఈ ఇద్దరి మధ్య రాజీకుదిర్చేందుకు విజయనిర్మలకు ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేసినట్లు చెబుతున్నారు. మొత్తానికి విశాఖ తూర్పులో పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తోంది వైసీపీ.. ఎన్నికలకు ఇంకా ఆర్నెల్ల సమయం ఉండటంతో ఈ కాలాన్ని ఎంపీ ఎంవీవీ ఎలా సద్వినియోగం చేసుకుంటారో చూడాల్సివుంది.

ట్రెండింగ్ వార్తలు