Tirupati Murder : మద్యం మత్తులో మర్డర్ చేశానన్నాడు…హత్య చేసిన ప్రత్యర్ధులు

మద్యపానం,ధూమపానం సేవించటం ప్రాణానికి హానికరం అని సినిమా ప్రారంభంలో ఒక స్లైడ్ వేస్తారు.  కానీ మద్యం తాగిన మైకంలో   ఒక వ్యక్తి  హత్యచేశానని చెప్పుకోవటంతో  తన ప్రాణాలు కోల్పోయిన ఘటన త

Tirupati Murder :  మద్యపానం,ధూమపానం సేవించటం ప్రాణానికి హానికరం అని సినిమా ప్రారంభంలో ఒక స్లైడ్ వేస్తారు.  కానీ మద్యం తాగిన మైకంలో   ఒక వ్యక్తి  హత్యచేశానని చెప్పుకోవటంతో  తన ప్రాణాలు కోల్పోయిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది.

గతనెల 3వ తేదీన తిరుపతిలోని ఉప్పంగి ఎస్సీ కాలనీకి చెందిన ప్రసన్నకుమార్(28) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ హత్యను తానే చేయించానని లక్ష్మీపతి అనే యువకుడు చెప్పటంతో ప్రసన్న కుమార్ స్నేహితుడు లక్ష్మీపతిని  సోమవారం దారుణంగా హత్య చేశాడు. ప్రసన్నకుమార్ హత్యకు ప్రతీకారంగానే ఈహత్య జరగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇటీవలికాలంలో టెంపుల్ సిటీలో జరుగుతున్నవరస హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.

వివరాలు పరిశీలిస్తే….. తిరుపతిలోని శ్రీనివాసపురానికి చెందిన లక్ష్మీ పతి అతిగా మద్యం సేవించేవాడు. మద్యం మత్తులో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఇతరులతో గొడవకు దిగేవాడు. జనవరి 3న తేదీన ఉప్పంగి హరిజనవాడకు చెందినప్రసన్నకుమార్ ను … రేణి గుంట రోడ్డులోని ఒక లాడ్జివద్ద ముగ్గురు వ్యక్తులు కత్తులతో పొడిచి  హత్య చేశారు.

ఈ హత్యతో  లక్ష్మీపతికి ఎలాంటి ప్రమేయం లేనప్పటికీ  మద్యం సేవించినప్పుడల్లా  ఆ హత్యను తానే ప్రణాళిక   రచించి చంపించానని అంటూ ఉండేవాడు. ఈవిషయమై ప్రసన్నకుమార్ బంధువైన వంశీ మరి కొందరు లక్ష్మీ పతి ఇంటికి వెళ్లి గతంలో  ప్రసన్నకుమార్ హత్యవిషయమై ఆరాతీశారు.  మద్యం మత్తులో ఏదో  మాట్లాడుతూ ఉంటాడు.. పట్టించుకోవద్దు అని అతని కుటుంబ సభ్యులు సర్ది చెప్పిపంపించివేశారు.
Also Read : India Covid Update : దేశంలో కొత్తగా 67,597 కోవిడ్ కేసులు
అయినా లక్ష్మీ పతి పదే పదే అవే వ్యాఖ్యలు పలువురి వద్ద చేయసాగాడు. నిన్న   ఉదయం వంశీ లక్ష్మీ పతి ఇంటికి వెళ్లి మట్లాడుకుందాం రా   అని చెప్పి ఉప్పంగి హరిజన వాడకు తీసుకువచ్చాడు. అక్కడ ఇద్దరూ మద్యం సేవించారు.  అనంతరం ఇద్దరి మధ్య మళ్లీ ప్రసన్నకుమార్ హత్యపై వాగ్వాదం జరిగింది. ఈక్రమంలో వంశీ  లక్ష్మీపతిపై   కత్తితో దాడి చేసి చంపేశాడు. ఘటనా స్ధలానికివచ్చిన పోలీసులు మృతదేహాన్ని ఎస్వీ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు