నిండు కుటుంబాన్ని బలి తీసుకున్న లారీడ్రైవర్ నిర్లక్ష్యం

గుడికి వెళుతున్న ఆ కుటుంబాన్ని దారి మధ్యలో మృత్యువు కబళించింది. లారీ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది.

Rajasthan Road Accident: లారీడ్రైవర్ నిర్లక్ష్యం ఓ నిండు కుటుంబాన్ని బలి తీసుకుంది. హైవేపై అడ్డదిడ్డంగా లారీని నడిపి దారుణ ప్రమాదానికి కారణమయ్యాడో లారీడ్రైవర్. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి కారణమైన లారీడ్రైవర్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

రాజస్థాన్‌లోని ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై యూటర్న్ తీసుకుంటున్న ట్రక్కును కారు ఢీకొనడంతో ఈ దుర్గటన చోటుచేసుకుంది. లారీడ్రైవర్ వెనుకాముందు చూసుకోకుండా అకస్మాత్తుగా యూటర్న్ తీసుకోవడంతో వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి కారు.. లారీ కిందకు దూసుకుపోయింది. సవాయ్ మాధోపూర్ జిల్లాలోని బోన్లీ పోలీస్ స్టేషన్ పరిధిలో బనాస్ నది వంతెన సమీపంలో ఆదివారం జరిగిన ఈ యాక్సిడెంట్ లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు మరణించారు. ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

గుడికి వెళుతుండగా..
మృతులను మనీష్ శర్మ, అతని భార్య అనితా శర్మ, సతీష్ శర్మ, పూనమ్, అతని అత్త సంతోష్, అతని స్నేహితుడు కైలాష్‌గా గుర్తించారు. మనన్, దీపాలి అనే ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. సికార్ జిల్లాకు చెందిన వీరంతా కారులో రణతంబోర్‌లోని త్రినేత్ర గణేష్ ఆలయానికి వెళుతుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

Also Read: ‘గుడ్ బై డాడీ’ అని చెప్పించి మరీ.. సొంత కొడుకుని ఇలా దారుణంగా చంపేసిన అమ్మ

సీఎం, డిప్యూటీ సీఎం సంతాపం
ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ, డిప్యూటీ సీఎం దియా కుమారి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధితులకు అవసరమైన సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

 

ట్రెండింగ్ వార్తలు