‘గుడ్ బై డాడీ’ అని చెప్పించి మరీ.. సొంత కొడుకుని ఇలా దారుణంగా చంపేసిన అమ్మ 

Crime: మాజీ భర్త మీద కోపంతో పిచ్చిపట్టిన దానిలా ప్రవర్తించింది. వెడ్డింగ్ ఫొటోలను కూడా షూట్ చేయడం..

‘గుడ్ బై డాడీ’ అని చెప్పించి మరీ.. సొంత కొడుకుని ఇలా దారుణంగా చంపేసిన అమ్మ 

Crime News

తమ ప్రాణమైనా ఇచ్చి పిల్లల ప్రాణాలను కాపాడుతారు తల్లులు. కొందరు తల్లులు మాత్రం రాక్షసుల్లా పిల్లల ప్రాణాలు తీస్తున్నారు. అమ్మతనానికే మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. తాజాగా, అమెరికాలో ఓ తల్లి తన మూడేళ్ల కుమారుడి పట్ల కర్కశత్వం ప్రదర్శించింది.

కన్న కొడుకుని దారుణంగా చంపేయడమే కాకుండా, హత్య చేసేముందు మరో కర్కశత్వానికి పాల్పడింది. కుమారుడితో ‘గుడ్ బై టు డాడీ’ చివరి మాటగా చెప్పిస్తూ వీడియో తీసింది. టెక్సాస్‌కు చెందిన సవన్నా క్రిగర్ (32) తన మూడేళ్ల కొడుకును తుపాకీతో కాల్చి చంపేసింది. ఆ తరువాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంది.

శాన్ ఆంటోనియోలోని ఓ పార్కులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. క్రిగర్, ఆమె కుమారుడు కైడెన్ తలలపై తుపాకీతో కాల్చుకున్న గాయాలు కనపడ్డాయని పోలీసులు తెలిపారు. క్రిగర్ కొన్ని వారాలుగా తన మాజీ భర్త మీద కోపంతో పిచ్చిపట్టిన దానిలా ప్రవర్తించింది. వెడ్డింగ్ ఫొటోలను కూడా షూట్ చేయడం, తన మాజీ భర్త ఇంటిని ధ్వంసం చేయడం, అతడిని బెదిరించడం వంటి చర్యలకు పాల్పడింది.

Also Read : ప్రాణం తీసిన క్రికెట్ బంతి.. 11 ఏళ్ల బాలుడు మృతి.. ప్రైవేటు పార్టుకు బలంగా తాకిన బాల్..