Pune : ప్రాణం తీసిన క్రికెట్ బంతి.. 11 ఏళ్ల బాలుడు మృతి.. ప్రైవేటు పార్టుకు బలంగా తాకిన బాల్..

క్రికెట్ బంతి ఓ 11 ఏళ్ల బాలుడి ప్రాణాన్ని తీసింది.

Pune : ప్రాణం తీసిన క్రికెట్ బంతి.. 11 ఏళ్ల బాలుడు మృతి.. ప్రైవేటు పార్టుకు బలంగా తాకిన బాల్..

PIC credit @ NDTV

మ‌న‌దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. క్రికెట్‌ను చూడ‌డమే కాదు ఏ మాత్రం ఖాళీ దొరికినా చిన్నారులు, యువ‌త బ్యాట్, బాల్ ప‌ట్టుకుని గ‌ల్లీల్లో, మైదానాల్లో ఎక్క‌డ ప‌డితే అక్క‌డ క్రికెట్ ఆడుతుండ‌డాన్ని చూస్తూనే ఉంటాం. కాగా.. క్రికెట్ బంతి ఓ 11 ఏళ్ల బాలుడి ప్రాణాన్ని తీసింది. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని పూణేలో చోటు చేసుకుంది.

పూణేలోని లోహెగావ్ ప్రాంతంలో శంభు కాళిదాస్ అలియాస్ శౌర్య వేస‌వి సెల‌వులు కావ‌డంతో తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. శౌర్య బౌలింగ్ చేస్తుండ‌గా మ‌రో బాలుడు బ్యాటింగ్ చేశాడు. స‌ద‌రు బాలుడు కొట్టిన బంతి వేగంగా వ‌చ్చి శౌర్య ప్రైవేటు పార్టుకి బ‌లంగా తాకింది. దీంతో అత‌డు అక్క‌డిక్క‌క్క‌డే కుప్ప‌కూలిపోయాడు. అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లిపోయాడు.

ఢిల్లీ ఘటన మరవకముందే మరోసారి వార్నింగ్.. బాంబు బెదిరింపులతో ఉలిక్కిపడ్డ అహ్మదాబాద్

ఈ హఠాత్పరిణామంతో మిగిలిన వారు భ‌యాందోళ‌న‌కు గురి అయ్యారు. శౌర్య‌ను మామాలు స్థితికి తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నించారు. అయిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేక‌పోయింది. వెంట‌నే చుట్టు పక్క‌ల వారు అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించాగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై పోలీసులు ప్రమాద‌వ‌శాత్తు బాలుడు మ‌ర‌ణించిన‌ట్లుగా కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.