Borewell Boy : బోరు బావిలో పడ్డ బాలుడు-సాహసం చేసి కాపాడిన యువకుడు

ఏలూరు జిల్లాలో ఒక యువకుడు ప్రాణాలకు తెగించి సాహసం చేశాడు.  బోరు బావిలో పడిపోయిన బాలుడిని బయటకు తీసుకు వచ్చి రక్షించాడు.

Borewell Boy :  ఏలూరు జిల్లాలో ఒక యువకుడు ప్రాణాలకు తెగించి సాహసం చేశాడు.  బోరు బావిలో పడిపోయిన బాలుడిని బయటకు తీసుకు వచ్చి రక్షించాడు. జిల్లాలోని ద్వారకా తిరుమల మండలం గుండుగోలనుకుంటలో జశ్వంత్(9) అనే బాలుడు ఆడుకుంటుండగా ప్రమాద వశాత్తు 400 అఢుగులు లోతు ఉన్న బోరు బావిలో పడిపోయాడు.

బావి  లోపల రాళ్లు ఉండటంతో బాలుడు 30 అడుగుల వద్ద రాయిపై చిక్కుకున్నాడు. సాయంత్రం అయినా ఆడుకోటానికి వెళ్లిన జస్వంత్ ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు బాలుడి కోసం గాలించారు. బోరు బావి వైపు వెళ్ళి చూడగా అక్కడ నుంచి బాలుడి అరుపులు విని అతడిని గుర్తించారు.

ఈ సమాచారం తెలిసి గ్రామస్తులంతా ఘటనా స్ధలానికి చేరుకున్నారు. బాలుడిని బయటకు ఎలా తీయాలా అని అందరూ తర్జన భర్జన పడుతున్న సమయంలో సురేష్ అనే యువకుడు ఒక సలహా చెప్పాడు.  తాను తాడు కట్టుకుని లోపలకు దిగుతాను అని… బాలుడికి తాడు కట్టిన తర్వాత ఇద్దరినీ   పైకి లాగమని కోరాడు. అందరూ సరే అని సిధ్దమయ్యారు.

సురేష్  నడుంకు తాడుకట్టుకొని తల కిందులుగా బోరు బావిలోకి దిగిన సురేష్  జశ్వంత్ ను పట్టుకుని అతడి నడముకు తాడు కట్టాడు.  పైన ఉన్న ప్రజలు సురక్షితంగా ఇద్దరినీ పైకి లాగారు. బాలుడు సురక్షితంగా బయటకు రావటంతో స్ధానికులు  సురేష్ సహసాన్ని అభినందించారు.

Also Read : Prawn In The Nose : ముక్కులో దూరిన రొయ్య

ట్రెండింగ్ వార్తలు