మార్పు కోసం, సేవ కోసం పవన్ వచ్చాడని భావించాం.. కానీ: పోతిన మహేశ్

Pothina Mahesh: రెండు నెలల్లోపే జనసేన పార్టీ కార్యాలయం పక్కనే 5 ఎకరాలు కొన్నారని అన్నారు.

Pothina Mahesh: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేత పోతిన మహేశ్ మరోసారి విమర్శలు గుప్పించారు. మార్పు కోసం, సేవ చేయడం కోసం పవన్ కల్యాణ్ రాజకీయాల్లో వచ్చారని భావించామని.. కానీ, చంద్రబాబు నాయుడికి సేవ చేయడం కోసం, ప్యాకేజీ కోసం వచ్చారని ఇప్పుడు అందరికీ తెలిసిందని చెప్పారు.

విజయవాడలో పోతిన మహేశ్ మీడియాతో మాట్లాడుతూ..  2014లో కారుకి కూడా ఈఎంఐ కట్టలేనని పవన్ కల్యాణ్ అన్నారని తెలిపారు. అపార్ట్‌మెంట్లో అద్దెకు ఉంటున్నానని చెప్పారని అన్నారు. మరి ఇప్పుడు ఆయనకు 2 వేల కోట్ల రూపాయలు ఎక్కడ నుంచి వచ్చాయని నిలదీశారు.

చంద్రబాబుకి పవన్ కల్యాణ్ పాలేరుగా పని చేస్తున్నారని పోతిన మహేశ్ అన్నారు. గత ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రతిపక్షానికి పడకుండా వామపక్షాలతో కలిసి పోటీ చేశారని చెప్పారు. అయినప్పటికీ ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చారని తెలిపారు. జనసేన పార్టీని స్థాపించింది ఆస్తులు సంపాదించడానికేనని చెప్పారు.

రెండు నెలల్లోపే జనసేన పార్టీ కార్యాలయం పక్కనే 5 ఎకరాలు కొన్నారని అన్నారు. 100 కోట్ల రూపాయల ల్యాండ్ నేషనల్ హైవే పక్కనే కొన్నారని ఆరోపించారు. సీఐడీకి ఫిర్యాదు చేస్తానని, సీబీఐ విచారణ కోరుతానని చెప్పారు. ఐటీ శాఖకు కూడా ఫిర్యాదు చేస్తానని తెలిపారు. కాపు పెద్దలు, ఎన్ఆర్ఐల నుంచి రూ.125 కోట్లు జనసేనకి విరాళాలుగా వచ్చాయని అన్నారు. లెక్కలు చెప్పాలని అడిగిన నేతలను పార్టీ నుంచి బయటకు పంపారని తెలిపారు.

Also Read: నెల్లూరు జిల్లా టీడీపీలో వర్గపోరు.. ఆనం సమక్షంలోనే కొట్టుకున్న తెలుగు తమ్ముళ్లు

ట్రెండింగ్ వార్తలు