iPhone NavIC Support : ఆపిల్ ఫ్యాన్స్ ఇది విన్నారా?.. కొత్త ఐఫోన్ 15 ప్రోలో శాటిలైట్ నావిగేషన్ NavIC సిస్టమ్.. ఐఫోన్లలో ఇదే ఫస్ట్ టైం.. ఏ ఫోన్ ధర ఎంతంటే?

iPhone NavIC Support : ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్‌లో NavIC సపోర్టును అందిస్తోంది. అయితే, ప్రో మోడల్‌లు మాత్రమే భారతీయ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్‌కు సపోర్టు ఇస్తాయని గమనించాలి. ఇదేలా పనిచేస్తుందంటే?

Apple adds Indian GPS system NavIC support to iPhone 15 Pro and iPhone 15 Pro Max

iPhone NavIC Support : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ సొంత బ్రాండ్ ఐఫోన్లలో కొత్త మోడల్ ఐఫోన్ 15 (iPhone 15 Series) సిరీస్‌ను గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఆపిల్ వండర్‌లస్ట్ ఈవెంట్ 2023లో సరికొత్త ఐఫోన్ మోడల్స్ కంపెనీ ఆవిష్కరించింది. ఆపిల్ ప్రవేశపెట్టిన ఐఫోన్ మోడళ్లలో ఐఫోన్ 15 ప్రో మోడల్స్‌కు అత్యాధునిక టెక్నాలజీని అందిస్తోంది. ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లలో భారత సొంత శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ NavIC (నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టెలేషన్) సపోర్టును అందిస్తోంది.

రాయిటర్స్ నివేదిక ప్రకారం.. గత ఏడాదిలో భారత ప్రభుత్వం విదేశీ GPS సిస్టమ్‌లను తొలగించి NavICని స్వీకరించమని అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లను కోరింది. నావిగేషన్ సిస్టమ్‌కు సపోర్టు ఇవ్వడానికి మొబైల్ కంపెనీలు కొన్ని హార్డ్‌వేర్ మార్పులు చేయవలసి ఉంటుందని పేర్కొన్నాయి. అయితే, ఈ నావిగేషన్ సిస్టమ్ అందించడం ద్వారా ఆయా స్మార్ట్‌ఫోన్‌లు మరింత ఖరీదైనదిగా మారుతాయని ప్రభుత్వ పత్రాలు వెల్లడించాయని రాయిటర్స్ నివేదిక పేర్కొంది.

2018లో భారతీయ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ :
భారత ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా ఆపిల్ ఇటీవల విడుదల చేసిన (iPhone 15)లో NavIC సపోర్టును అందించింది. ఐఫోన్ 15 ప్రో మోడల్‌లు మాత్రమే భారతీయ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్‌కు సపోర్టు ఇస్తున్నాయి. 2018లో భారత్‌లో నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టెలేషన్ ప్రారంభమైంది. స్వతంత్ర నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్‌ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అభివృద్ధి చేసింది. NavIC భారత్, చుట్టుపక్కల ప్రాంతాలపై కచ్చితమైన లొకేషన్లు, టైమ్ డేటాను అందిస్తుంది. అర డజనుకు పైగా శాటిలైట్ల ద్వారా NavIC భారత్ మొత్తం భూభాగానికి కవరేజీని విస్తరించింది.

ఐఫోన్ 15 ప్రోలో NavIC సపోర్టు :
ఆపిల్ 2023 ఏడాదిలో అతిపెద్ద ఈవెంట్ (Wonderlust)ని సెప్టెంబర్ 12న నిర్వహించింది. ఈ సందర్భంగా కంపెనీ iPhone 15 సిరీస్‌ను ప్రవేశపెట్టింది. దాంతో పాటు, ఆపిల్ వాచ్ 9, ఆపిల్ వాచ్ అల్ట్రా 2 కూడా లాంచ్ అయ్యాయి. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్, ఐఫోన్ 15 ప్లస్ అనే 4 మోడల్‌లు రిలీజ్ అయ్యాయి. ఆపిల్ అధికారిక వెబ్‌సైట్‌లోని స్పెసిఫికేషన్‌ల పేజీ ప్రకారం.. iPhone 15 ప్రో మోడల్‌లు NavICకి సపోర్టు ఇస్తాయి. ఆపిల్ తన ఫోన్‌లలో NavIC సపోర్ట్‌ను అందించడం ఇదే మొదటిసారిగా చెప్పవచ్చు. అయితే, ఐఫోన్ 15 ప్రో మోడళ్లలో చేర్చే ఇతర ఫీచర్లపై ఇంకా స్పష్టత లేదు.

Read Also : Apple Wonderlust Event : ఆపిల్ ఐఫోన్ 15 లాంచ్.. భారత్‌లో ఈ 4 ఐఫోన్ మోడల్స్ నిలిపివేసింది.. మీరు వాడే ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి!

ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫీచర్లు :
ఐఫోన్ 15 ప్రో, ప్రో మ్యాక్స్‌లు గ్రేడ్ 5 టైటానియం బాడీని కలిగి ఉన్నాయి. తద్వారా ఐఫోన్‌ మరింత మన్నికైనదిగా ఉంటుంది. ఈ ఐఫోన్ 15 మోడల్ బరువు కూడా చాలా తేలికగా ఉంటుంది. ఈ ఫోన్‌లు 6.1 అంగుళాల, 6.7 అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే, సన్నని బార్డర్లతో ఉన్నాయి. ముందు భాగంలో అదనపు ప్రొటెక్షన్ లేయర్ సిరామిక్ షీల్డ్ ఉంది. అదనంగా, iPhone 15 Pro, Pro Maxలో USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్ కూడా అందిస్తుంది.

Apple adds Indian GPS system NavIC support to iPhone 15 Pro and iPhone 15 Pro Max

ఆపిల్ ఐఫోన్ మోడళ్లలో లైటనింగ్ పోర్టుకు బదులుగా టైప్ సీ పోర్టు సపోర్టు అందించిన మొదటి మోడల్ అని చెప్పవచ్చు. ఈ ఐఫోన్‌ల ఎడ్జెస్ కూడా గుండ్రంగా, చాలా మృదువుగా ఉంటాయి. దాంతో చేత్తో పట్టుకోవడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. గత ఏడాదిలో ఐఫోన్ ప్రో మోడల్‌ల మాదిరిగానే, ఫోన్‌లు డైనమిక్ ఐలాండ్ నాచ్‌ను కలిగి ఉంటాయి. ఆపిల్ సాధారణ మ్యూట్ బటన్‌కు బదులుగా యాక్షన్ బటన్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఈ రెండు ఫోన్‌లు సరికొత్త A17 ప్రో ప్రాసెసర్‌తో మెరుగైన కెమెరా పర్పార్మెన్స్ కలిగి ఉన్నాయి.

ఐఫోన్ 15 ప్రో భారత్ ధర ఎంతంటే :
గత ఏడాదితో పోలిస్తే.. భారత మార్కెట్లో ఐఫోన్ 15 ప్రో మోడల్స్ ధరలు పెరిగాయి. iPhone 15 Pro మొత్తం 4 స్టోరేజ్ వేరియంట్‌లలో 128GB, 256GB, 512GB, 1TB వరకు అందిస్తుంది. ఈ ఫోన్ బ్లాక్ టైటానియం, వైట్ టైటానియం, బ్లూ టైటానియం, నేచురల్ టైటానియం అనే 4 కలర్ ఆప్షన్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది. 128GB వేరియంట్ ధర రూ.1,34,900 కాగా, 256GB వేరియంట్ ధర రూ.1,44,900, 512GB వేరియంట్ రూ. 1,64,900, 1TB వేరియంట్ ధర రూ. 1,84,900 నుంచి అందుబాటులో ఉంటాయి.

ఆండ్రాయిడ్ ఫోన్లలో NavIC సపోర్టు :
అధికారిక స్పెక్స్ పేజీల ప్రకారం.. గ్లోబల్ iPhone 15 ప్రో మోడల్‌లు NavICకి కూడా సపోర్టు ఇస్తున్నాయి. అలాగే, చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) ఫోన్లలో Mi 11X, 11T Pro, OnePlus Nord 2T, Realme 9 Proతో సహా అనేక స్మార్ట్‌ఫోన్‌లు NavICకి సపోర్టు ఇస్తున్నాయి.

Read Also : Apple iOS 17 Update : ఈ నెల 18నే ఆపిల్ iOS 17 కొత్త అప్‌డేట్.. ఈ ఐఫోన్ల జాబితాలో మీ ఫోన్ మోడల్ ఉందేమో చెక్ చేసుకోండి..!

ట్రెండింగ్ వార్తలు