4G Smart Android Cluster : జియోథింగ్స్‌తో మీడియాటెక్.. టూవీలర్ల కోసం 4జీ స్మార్ట్ ఆండ్రాయిడ్ క్లస్టర్ మాడ్యూల్‌..!

4G Smart Android Cluster : ప్రత్యేకంగా మోటార్‌సైకిళ్లు, స్కూటర్‌ల కోసం రూపొందించిన "మేడ్ ఇన్ ఇండియా" స్మార్ట్ డిజిటల్ క్లస్టర్, స్మార్ట్ మాడ్యూల్‌ను రిలీజ్ చేసేందుకు జియోథింగ్స్‌తో మీడియాటెక్ భాగస్వామ్యం కలిగి ఉంది.

JioThings and MediaTek partner to bring 4G smart Android cluster ( Image Source : Google )

4G Smart Android Cluster : ప్రపంచంలోని ప్రముఖ ఫ్యాబ్లెస్ సెమీకండక్టర్ కంపెనీ మీడియా టెక్, జియో ప్లాట్‌ఫారమ్‌ల అనుబంధ సంస్థ, ఎండ్-టు-ఎండ్ అత్యాధునిక ఐఓటీ (IoT) సొల్యూషన్‌లను అందించే ఏకైక ప్రొవైడర్ జియోథింగ్స్ లిమిటెడ్ ‘మేడ్ ఇన్ ఇండియా’ లాంచ్‌ను ప్రకటించింది. భారత మార్కెట్లో “స్మార్ట్ డిజిటల్ క్లస్టర్, స్మార్ట్ మాడ్యూల్ ప్రత్యేకంగా 2-వీలర్ (2W) మార్కెట్ కోసం రూపొందించాయి.

Read Also : Jio New Annual Plan : జియో యూజర్ల కోసం కొత్త వార్షిక ప్లాన్లు.. నెలకు రూ.276.. ఏడాదంతా ఎంజాయ్ చేయొచ్చు!

ప్రత్యేకంగా మోటార్‌సైకిళ్లు, స్కూటర్‌ల కోసం రూపొందించిన “మేడ్ ఇన్ ఇండియా” స్మార్ట్ డిజిటల్ క్లస్టర్, స్మార్ట్ మాడ్యూల్‌ను రిలీజ్ చేసేందుకు జియోథింగ్స్‌తో మీడియాటెక్ భాగస్వామ్యం కలిగి ఉంది. ఈ సహకారంతో మీడియా టెక్ అధునాతన చిప్‌సెట్ టెక్నాలజీ, జియో థింగ్స్ వినూత్న డిజిటల్ సొల్యూషన్‌లను 2-వీలర్ స్పేస్‌లో ఉనికిని బలోపేతం చేయడంతో పాటు ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ల్యాండ్‌స్కేప్‌లో విప్లవాత్మక మార్పులను తీసుకువస్తుంది. తద్వారా ఎలక్ట్రిక్, సాంప్రదాయ ద్విచక్ర వాహన తయారీదారులకు ప్రత్యేకమైన ఆఫర్‌ను అందిస్తుంది.

“మా 4జీ స్మార్ట్ ఆండ్రాయిడ్ డిజిటల్ క్లస్టర్, యాప్ సూట్, స్మార్ట్ మాడ్యూల్ సొల్యూషన్స్‌తో మొబిలిటీ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు మీడియా టెక్‌తో కలిసి పనిచేయడానికి జియో థింగ్స్ సంతోషంగా ఉంది” అని జియో ప్లాట్‌ఫారమ్‌ల లిమిటెడ్ ప్రెసిడెంట్, సీఈఓ కిరణ్ థామస్ అన్నారు.

మీడియాటెక్ (MT8766, MT8768) చిప్‌సెట్‌ల ద్వారా ఆధారితమైన పవర్‌ఫుల్ ఆండ్రాయిడ్-ఆధారిత స్మార్ట్ డిజిటల్ క్లస్టర్. ఈ క్లస్టర్‌లు AOSP-ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్ జియోథింగ్స్ (‘AvniOS)పై రన్ అవుతాయి. ఓఈఎమ్ (OEM) హై పర్ఫార్మెన్స్, కస్టమైజడ్ ప్లాట్‌ఫారమ్‌తో అందిస్తాయి. స్మార్ట్ డిజిటల్ క్లస్టర్ అనేక రకాల ఫీచర్లను అందిస్తుంది.

రియల్ టైమ్ డేటా అనలిటిక్స్ : రైడర్‌లకు రైడింగ్ అలవాట్లు, వెహికల్ పర్ఫార్మెన్స్ గురించి అనలిటిక్స్
కస్టమైజడ్ ఇంటర్‌ఫేస్‌లు : పర్సనలైజడ్ డాష్‌బోర్డ్‌లు, డేటా డిస్‌ప్లే అందిస్తుంది.
వాయిస్ రికగన్నైజేషన్ : వివిధ ఫీచర్ల హ్యాండ్స్-ఫ్రీ కంట్రోలింగ్ ఎనేబుల్ చేస్తుంది.
ఇంటీగ్రేషన్ : వాహన కంట్రోలర్‌లతో కనెక్టివిటీ, ఐఓటీ ఎనేబుల్డ్ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్మార్ట్ బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లు

హార్డ్‌వేర్‌తో పాటు, రైడర్‌లు జియో వాయిస్ అసిస్టెంట్, జియోసావన్, జియోపేజెస్, జియోఎక్స్‌ప్లోర్ వంటి సేవలతో జియో ఆటోమోటివ్ యాప్ సూట్‌కు యాక్సెస్‌ పొందవచ్చు. దేశంలో ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లో 3 మిలియన్లకు పైగా ఈవీలు, 2025 నాటికి మార్కెట్ విలువ రూ. 10వేల కోట్ల అంచనాలతో, స్మార్ట్, కనెక్ట్ చేసిన ఫీచర్‌లకు డిమాండ్ గతంలో కన్నా ఎక్కువగా పెరిగింది.

Read Also : Reliance Jio Plans : జియో యూజర్లకు పండగే.. ఆ ప్రీపెయిడ్ ప్లాన్ మళ్లీ వచ్చిందోచ్.. మరెన్నో బెనిఫిట్స్ కూడా!

ట్రెండింగ్ వార్తలు